Raj Nidimoru: వ్యూహాత్మక మౌనానికి కారణం అదేనా...
ABN , Publish Date - Jun 02 , 2025 | 01:45 PM
ప్రముఖ దర్శక నిర్మాత రాజ్ నిడిమోరు - సమంత మధ్య ఉన్న బంధం రోజు రోజుకూ బలపడుతోంది. రాజ్ భార్య శ్యామాలీ సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులు చూస్తుంటే... వీరిద్దరూ విడిపోవడం ఖాయమనిపిస్తోంది.
స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కెరీర్ ఇప్పుడిప్పుడే మళ్ళీ గాడిలో పడుతోంది. అనారోగ్యం నుండి కోలుకోవడమే కాదు... నాగ చైతన్య (Naga Chaitanya) తో విడాకుల తర్వాత తిరిగి నిదానంగా సర్దుకుంటోంది. నిర్మాతగా తీసిన 'శుభం' (Subham) సినిమా థియేటర్లలో ఫర్వాలేదనిపించుకుంది. ప్రస్తుతం ఇది ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాలో సమంత సైతం గెస్ట్ అప్పీయరెన్స్ ఇచ్చింది. అలానే 'ఫ్యామిలీ మ్యాన్ -2' (Family Man -2) తర్వాత చేసిన 'సిటాడెల్' (Citadel) వెబ్ సీరిస్ యాక్షన్ హీరోయిన్ గా సమంతకు పేరు తెచ్చిపెట్టింది. ప్రస్తుతం ఆమె తాను నిర్మిస్తున్న మరో సినిమా 'మా ఇంటి బంగారం'ను పూర్తి చేసి జనం ముందుకు తీసుకొచ్చే పనిలో ఉంది. ఇదిలా ఉంటే... వ్యక్తిగత జీవితంలోనూ ఆమెకు తోడు దొరికినట్టు అయ్యింది.
పలు బాలీవుడ్ చిత్రాలతో పాటు వెబ్ సీరిస్ లను రూపొందించిన రాజ్ నిడిమోరు (Raj Nidimoru) తో సమంత సహజీవనం చేస్తోందనే వార్తలలో రోజు రోజుకు బలం పెరుగుతోంది. వారిద్దరూ డేటింగ్ చేస్తున్నారనే రూమర్స్ పుట్టిన తర్వాత రాజ్ భార్య శ్యామాలి డే (Shhyamali De) మనసులోని మాటలను ఒక్కొక్కటిగా బయట పెట్టడం మొదలెట్టింది. బాలీవుడ్ లో కొన్ని సినిమాలకు రచన చేసి, దర్శకత్వ శాఖలో పనిచేసిన శ్యామాలి డే ను రాజ్ నిడిమోరు ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు. 2015లో వీరి పెళ్ళి కాగా... పదేళ్ళు తిరిగే సరికీ ఇప్పుడు విడాకుల బాట పట్టబోతున్నారని తెలుస్తోంది. ఈ విషయంలో రాజ్ వ్యూహాత్మక మౌనం పాటిస్తుండగా శ్యామాలీ మాత్రం తన ఆక్రోశాన్ని, ఆగ్రహాన్ని పరోక్షం సోషల్ మీడియా ద్వారా బయట పెడుతోంది. రెండు రోజుల క్రితం వీకెండ్ ను ఎంజాయ్ చేస్తున్నానంటూ సమంత పెట్టిన ఫోటోస్, రాజ్ నిడిమోరుతో కలిసి పికిల్ బాల్ ఆడుతున్న వీడియాలో శ్యామాలీ డే ను మరింత బాధకు గురి చేసినట్టు తెలుస్తోంది. సమంత పెట్టిన కామెంట్స్ తో హర్ట్ అయిన శ్యామాలి గత రెండు రోజులుగా ఇన్ స్టా వేదికగా కొన్ని పోస్టులను పెట్టింది. 'అన్నింటినీ కాలమే నిర్ణయిస్తుంది. కర్మ వాటిని సరిదిద్దుతుంది. విశ్వం వినయాన్ని నేర్పిస్తుంది' అని ఒక దానిలోనూ, 'ఆత్మ మేల్కొన్నప్పుడు ప్రతిదీ అర్థంకావడం మొదలవుతుంది' అని మరో దానిలోనూ పేర్కొంది. ఇన్ డైరెక్ట్ గా ఆమె పెడుతున్న పోస్టులను చూస్తున్న వారు... ఆమె కాపురం కూలిపోయినట్టేనని, అతి త్వరలోనే సమంత అధికారికంగా రాజ్ నిడిమోరుతో కొత్త బంధం గురించి ప్రకటన చేస్తుందని అంటున్నారు. అయితే అధికారికంగా విడాకులు మంజూరు అయ్యే వరకూ వీరి సహజీవనం చేస్తారు తప్పితే... ఎలాంటి ప్రకటన చేయరని సన్నిహితులు చెబుతున్నారు. మరి ఈ మిస్టరీ ఎప్పుడు వీడుతుందో చూడాలి.
Also Read: Telusu Kada: సిద్దు జొన్నలగడ్డ.. తెలుసుకదా రిలీజ్ డేట్ వచ్చేసింది! ఎప్పుడంటే...
Also Read: Retro: థియేటర్ లో ప్లాప్ చేసి.. ఓటీటీలో హిట్ అంటారేంటి.. ?
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి