యుద్ధ వీరుడిగా శ్రీకృష్ణుడు

ABN , Publish Date - Aug 16 , 2025 | 05:24 AM

చలనచిత్ర పరిశ్రమలో తొలిసారిగా శ్రీకృష్ణుడిని ఒక యుద్ధ వీరుని పాత్రలో చూపిస్తూ నిర్మిస్తున్న చిత్రం ‘శ్రీకృష్ణ అవతార్‌ ఇన్‌ మహోబా’.

చలనచిత్ర పరిశ్రమలో తొలిసారిగా శ్రీకృష్ణుడిని ఒక యుద్ధ వీరుని పాత్రలో చూపిస్తూ నిర్మిస్తున్న చిత్రం ‘శ్రీకృష్ణ అవతార్‌ ఇన్‌ మహోబా’. ముకుంద్‌ పాండే దర్శకత్వంలో అనిల్‌ వ్యాస్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో 11-12 వ శతాబ్దాల నాటి ‘మహోబా’ సాంస్కృతిక వైభవాన్ని, శ్రీకృష్ణుని దివ్యత్వాన్ని, ధీరత్వాన్ని, ఆధ్యాత్మిక ప్రాభవాన్ని చూపించే చిత్రమిదని దర్శకుడు చెప్పారు. ‘శ్రీకృష్ణ అవతార్‌ ఇన్‌ మహోబా’ పాన్‌ వరల్డ్‌ ప్రాజెక్ట్‌. ప్రపంచ స్థాయి సాంకేతిక నిపుణులతో తెరకెక్కిస్తున్నాం. చరిత్ర, సాంస్కృతిక వారసత్వం, ఆధ్యాత్మికతను వివరించే సినిమా ఇది’ అని నిర్మాత తెలిపారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు వెల్లడిస్తామన్నారు.

Updated Date - Aug 16 , 2025 | 05:24 AM