Priyanka Chopra: బికినీలో అమెరికా కోడలు సెగలు పుట్టిస్తుందిలా
ABN, Publish Date - Jul 20 , 2025 | 10:25 PM
బాలీవుడ్ హాట్ బ్యూటీ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
Priyanka Chopra: బాలీవుడ్ హాట్ బ్యూటీ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ లోనే టాప్ రెమ్యూనరేషన్ తీసుకొనే హీరోయిన్ గా ప్రియాంకా ఎప్పుడో రికార్డ్ సృష్టించింది. ఇక కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే తనకన్నా పదేళ్లు చిన్నవాడైనా పాప్ సింగర్ నిక్ జోనాస్ ను ప్రేమించి పెళ్లి చేసుకొని అమెరికా కోడలిగా సెటిల్ అయ్యిపోయింది.
ఇక అమెరికాకు వెళ్ళాకా.. హాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా మారింది. అడపాదడపా హిందీ సినిమాల్లో కనిపిస్తూనే ఉంది. ఇక ఇప్పుడు ఈ చిన్నది టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం SSMB29. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెల్సిందే. ఈ సినిమాపై యావత్ భారతదేశం భారీ అంచనాలను పెట్టుకున్న విషయం తెల్సిందే.
అమెజాన్ అడవుల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడట రాజమౌళి. ఇక ఈ చిత్రం పీసీ నెగిటివ్ రోల్ లో నటిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు అమ్మడు ఏం చేసినా తెలుగువారు అంతగా పట్టించుకొనేవారు కాదు. ఎప్పుడైతే మహేష్ సినిమాలో నటిస్తుందో అప్పటి నుంచి ఈ చిన్నది ఏం చేసినా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతుంది. తాజాగా పీసీ సోషల్ మీడియాను సెగలు పుట్టించింది. అమ్మడి అందాల ఆరబోతకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందని అందరికీ తెల్సిందే.
ముఖ్యంగా పీసీ బికినీ ట్రీట్ కు ఫిదా కానీ ప్రేక్షకుడు లేడు అంటే అతిశయోక్తి కాదు. పర్ఫెక్ట్ బాడీతో ప్రియాంక పిచ్చెక్కిస్తూ ఉంటుంది. తాజాగా మరోసారి బికినీ ట్రీట్ తో బెంబేలెత్తించింది. భర్త నిక్, కూతురు మాల్తీలతో వెకేషన్ ఎంజాయ్ చేస్తూ కనిపించింది. బికినీ వేసుకొని.. సముద్రపు ఒడ్డున నడిచి వస్తుంటే దేవకన్యలానే కనిపిస్తుందని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి SSMB29తో ప్రియాంక ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
Ram Charan: ఉపాసన బర్త్ డే.. స్పెషల్ గా విష్ చేసిన చరణ్
Roshan Meka: ఏడాదిలో 50 కథలు రిజెక్ట్.. నమ్మశక్యంగా లేదే