NTR-Hrithik Roshan: 25 ఏళ్ల కెరీర్.. గిఫ్ట్ గా వార్ -2 ట్రైలర్
ABN , Publish Date - Jul 22 , 2025 | 04:42 PM
బాలీవుడ్ సూపర్‌స్టార్ హృతిక్ రోషన్, టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇద్దరూ తమ 25 ఏళ్ల సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ‘వార్ 2’ ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు యశ్ రాజ్ ఫిల్మ్స్ సంస్థ వెల్లడించింది.
బాలీవుడ్ సూపర్‌స్టార్ హృతిక్ రోషన్, టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇద్దరూ తమ 25 ఏళ్ల సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ‘వార్ 2’ ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు యశ్ రాజ్ ఫిల్మ్స్ సంస్థ వెల్లడించింది. అయాన్ ముఖర్జీ దర్శశకత్వంలో స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఆగష్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ట్రైలర్ ను ఈ నెల 25న విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ తొలి సారిగా ఒకే స్క్రీన్‌పై కనిపించనున్న ఈ మల్టీ-స్టారర్ ప్రాజెక్ట్‌కి ఇప్పటికే భారీ హైప్ ఉంది. మరోవైపు, కియారా అద్వానీ కథానాయికగా నటిస్తోంది. వేర్వేరు ఇండస్ట్రీలకు చెందిన స్టార్ హీరోలు ఒకే సినిమాలో కుదరడం అరుదైన విషయం అని నిర్మాణ సంస్థ పేర్కొంది. ఈ హీరోలు ఇద్దరు నటన రంగంలో 25 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్న తరుణంలో ట్రైలర్ ను అభిమానులకు గిఫ్ట్ గా ఇవ్వాలని యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్ణయించిందట. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
తాజా పోస్ట్ లో ‘‘2025లో ఇండియన్ సినిమాలో ఇద్దరు ఐకానిక్ హీరోలు 25 ఏళ్ల సెలబ్రేషన్స్ చేసుకోవడం గొప్ప విషయం. ఇది లైఫ్‌టైమ్‌లో ఒకరి మాత్రమే వస్తుంది. ఆ అవకాశం యశ్ రాజ్ సంస్థకు దక్కింది’’ అని నిర్మాణ సంస్థ పేర్కొంది.
ALSO READ:
MM Keeravani Surprise: అప్పుడు రాజమౌళి కోసం.. ఇప్పుడు పవన్ కోసం.. ఫ్యాన్స్‌కి పండగే
Ustaad Bhagat singh: ఉస్తాద్‌లో రాశీఖన్నా అఫీషియల్.. దర్శకుడి ట్వీట్ వైరల్
తప్పిపోయిన బాలిక.. పాతికేళ్లకు చనిపోయి కనిపిస్తే! అదిరిపోయే మర్డర్ మిస్టరీ థ్రిల్లర్