Maa Boxoffice Collections: కాజోల్ కోసమే సోనాక్షి వెనక్కి వెళ్ళిందా...

ABN , Publish Date - Jul 01 , 2025 | 11:06 AM

కాజోల్ మూవీ మా కు దారి ఇచ్చి తాము వెనక్కి వెళ్ళామని, సోనాక్షి సిన్హా చెబుతోంది, మా, నికితా రాయ్ రెండు సినిమాలు సూపర్ నేచురల్ ఎలిమెంట్స్ వే కావడం కూడా అందుకు ఓ కారణమని తెలిపింది.

బాలీవుడ్ (Bollywood) స్టార్ హీరోయిన్ కాజోల్ (Kajol) నటించిన సూపర్ నేచురల్ మూవీ 'మా' (Maa) గత శుక్రవారం విడుదలైంది. ఓపెనింగ్స్ ఆశాజనకంగా ఉన్నా... సోమవారానికి ఈ సినిమా బాగా డ్రాప్ అయ్యిందని ట్రేడ్ వర్గాలు చెప్పాయి. చాలా కాలం తర్వాత కాజోల్ నటించిన హీరోయిన్ ఓరియంటెడ్ మూవీ కావడం, ఆమె ఈ జానర్ లో మొదటి సారి నటించడంతో సహజంగానే దీనిపై అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తగ్గట్టుగా ఓపెనింగ్స్ వచ్చిన... ఫలితం మాత్రం ఆశాజనకంగా లేకపోయింది. అయితే... కంగనా రనౌత్ (Kangana Ranaut) నటించిన 'ఎమర్జెన్సీ' (Emergency) మూవీ కంటే 'మా' బెటర్ గానే బాక్సాఫీస్ బరిలో పెర్ఫార్మ్ చేస్తోందని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అలానే జునైద్ ఖాన్ (Junaid Khan), ఖుషీ కపూర్ (Khushi Kapoor) నటించిన 'లవ్ యపా' (Loveyapa) మూవీ కంటే కూడా 'మా' ఎక్కువ కలెక్ట్ చేసిందని తెలిపాయి.


nik.jpegఇదిలా ఉంటే... 'మా' మూవీ విడుదలైన జూన్ 27వ తేదీనే సోనాక్షి సిన్హా నటించిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ మూవీ 'నికిత రాయ్' (Nikitha Roy) రిలీజ్ కావాల్సి ఉంది. కానీ చివరి నిమిషంలో ఈ సినిమా జులై 18కి వాయిదా పడింది. కాజోల్ అంటే తనకెంతో అభిమానమని, ఆమె చిత్రాలను చూస్తూ పెరిగానని, అనుకోకుండా తమ రెండు చిత్రాలు ఒకే రోజున విడుదల కావాల్సి వచ్చిందని అప్పటి వరకూ చెప్పిన సోనాక్షి సిన్హా... ఎప్పుడైతే తన సినిమా వాయిదా పడిందో ప్లేట్ మార్చేసింది. 'మా', 'నికితా రాయ్' రెండు సినిమాలు ఒకే రోజున విడుదల కావడం కరెక్ట్ కాదని తాము భావించామని, అందుకే 'మా'కు దారి ఇచ్చి తాము వేరే డేట్ ను ఎంచుకున్నామని తెలిపింది. ఎక్కువ థియేటర్లలో 'నికితా రాయ్'ను విడుదల చేయడానికి పంపిణీదారుల సలహా మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని సోనాక్షి వివరణ ఇచ్చింది. అయితే ఇలా సినిమాల విడుదల వాయిదా పడటం కొత్తేమీ కాదని చెబుతూ, 'గతంలోనూ అజయ్ దేవ్ గన్ తన చిత్రాన్ని 'కల్కి 2898 ఎ.డి' కోసం వాయిదా వేసుకున్నార'ని ఉదాహరించింది. ఏదేమైనా... 'మా' సినిమా బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో ఆడకపోవడమన్నది, త్వరలో జనం ముందుకు రాబోతున్న 'నికితా రాయ్' మీద కూడా పడే ఛాన్స్ ఉంది. సోనాక్షి ప్రధాన భూమిక పోషించిన ఈ సినిమాతో ఆమె సోదరుడు కుశ్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.

Also Read: Mandala Murders: స్ట్రీమింగ్ తేదీ వచ్చేసింది...

Also Read: Actor Sivaji Spl Chitchat: ఫైర్ బ్రాండ్ నటుడు శివాజీతో స్పెషల్ ఇంటర్వూ

Updated Date - Jul 01 , 2025 | 11:06 AM