Ramayan: ప్రపంచమంతా భారత్ వైపు.. బడ్జెట్ తెలిస్తే షాకవుతారు
ABN , Publish Date - Jul 15 , 2025 | 10:17 AM
ఇండియన్ సినిమాను ప్రపంచం చిన్నచూపు చూసినప్పుడు ఎంతో నిరాశకు గురవుతానని, ‘రామాయణ’ చరిత్ర సృష్టించడానికి సిద్థంగా ఉందని నిర్మాత నమిత్ మల్హోత్రా అన్నారు
బాలీవుడ్ దర్శకుడు నితీశ్ తివారీ (Nitesh Tiwari) రామాయణాన్ని మరోసారి ప్రేక్షకుల ముందుకుతీసుకురానున్న విషయం తెలిసిందే. రాముడిగా రణబీర్ కపూర్ (Ranbir kapoor), సీతగా సాయి పల్లవి (Sai pallavi)నటిస్తుండగా ‘రామాయణ’ (Ramayana) పేరుతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని రూపొందుతోంది. తాజాగా చిత్ర నిర్మాత నమిత్ మల్హోత్రా ఈ సినిమా బడ్జెట్ గురించి ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. దాదాపు రూ.4000 కోట్లతో ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇప్పటి దాకా ఇంత పెద్ద బడ్జెట్‌తో భారతీయ సినిమా రాలేదని ఆయన అన్నారు. ఇండియన్ సినిమాను ప్రపంచం చిన్నచూపు చూసినప్పుడు ఎంతో నిరాశకు గురవుతానని, ‘రామాయణ’ ప్రాజెక్ట్‌తో ప్రపంచమంతా భారత్ వైపు చూస్తుందని నమిత్ అన్నారు.
‘రామాయణ’ చరిత్ర సృష్టించడానికి సిద్థంగా ఉంది. ఈ సినిమా కోసం డబ్బు సమకూర్చుకుంటున్నాం. ఎవరి దగ్గరా డబ్బులు తీసుకోవాలని అనుకోవడం లేదు. ఏడు సంవత్సరాల క్రితమే ఈ సినిమాకు సంబంధించిన పనులు మొదలుపెట్టాం. కొవిడ్ తర్వాత దీన్ని ప్రారంభించినప్పుడు ప్రజలు నన్ను పిచ్చివాడిననుకున్నారు. దేశంలో ఎంత గొప్ప సినిమా అయినా ‘రామాయణ’ దరిదాపుల్లోకి కూడా రాలేదు. రెండు భాగాలుగా ప్లాన్ చేఽశాం. సుమారు రూ.4000 కోట్లతో రూపొందించనున్నాం. ప్రపంచమంతా ఈ ఇతిహాసాన్ని చూడాలన్న లక్ష్యంతోనే భారీ స్థాయిలో తెరకెక్కిసున్నాం. హాలీవుడ్ చిత్రాలకు అయ్యే ఖర్చు కంటే ఇది తక్కువే అని నేను భావిస్తున్నాను. ఎన్ని తరాలు మారినా, యుగాలు మారినా రామాయణం ఎప్పటికీ గొప్ప ఇతిహాసమే’ అని నిర్మాత అన్నారు నిర్మాత నమిత్ మల్హోత్ర.
క్యారెక్టర్స్ రివీల్ గ్లింప్స్ బయటికి వచ్చాక సినిమాపై అంచనాలు పెరిగాయి. అక్కడి నుంచి సినిమా బడ్జెట్ గురించి సినీ ప్రియులు విపరీతంగా చర్చించుకుంటున్నారు. రూ.835 కోట్లతో రానుందని కొందరు అనుకుంటే. మరి కొందరు రూ.1600 కోట్లని.. మొదటి పార్ట్ చిత్రీకరణకు రూ.900 కోట్ల వ్యయం అని, రెండోది రూ.700 కోట్లని అనుకున్నారు. నిర్మాత ఇచ్చిన స్టేట్‌మెంట్‌తో వాటన్నిటికీ ఫుల్‌స్టాప్ పడింది. ఈ సినిమాలో రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణుడిగా యశ్, హనుమంతుడి పాత్రలో సన్నీదేవోల్ నటిస్తున్నారు. ఈ సినిమా మొదటి పార్ట్ 2026 దీపావళికి, రెండోది 2027 దీపావళికి విడుదల కానుంది.
ALSO READ: Janhvi Kapoor: బాయ్ ఫ్రెండ్ మీద ప్రేమ ఓకే కానీ.. మరీ పబ్లిక్ లో ఇలా చేస్తే ఎలా పాప
Also Read: Do Bigha Zamin: పాత చిత్రాలకు కొత్త నగిషీలు