VenkateshXTrivikram: మొదలెట్టేసిన గురూజీ - వెంకీ మామ

ABN , Publish Date - Aug 15 , 2025 | 02:09 PM

ఇండస్ట్రీలో కొన్ని కాంబోస్ అస్సలు బోర్ కొట్టవు. ఎప్పుడెప్పుడు ఆ కాంబోస్ రిపీట్ అవుతాయా అని ఎదురుచూస్తూ ఉంటారు. అలా టాలీవుడ్ లో ఎన్నిసార్లు వచ్చినా బోర్ కొట్టని కాంబోస్ లలో వెంకటేష్( Venkatesh)- త్రివిక్రమ్ (Trivikram)కాంబో ఒకటి.

Venkatesh77

VenkateshXTrivikram: ఇండస్ట్రీలో కొన్ని కాంబోస్ అస్సలు బోర్ కొట్టవు. ఎప్పుడెప్పుడు ఆ కాంబోస్ రిపీట్ అవుతాయా అని ఎదురుచూస్తూ ఉంటారు. అలా టాలీవుడ్ లో ఎన్నిసార్లు వచ్చినా బోర్ కొట్టని కాంబోస్ లలో వెంకటేష్( Venkatesh)- త్రివిక్రమ్ (Trivikram)కాంబో ఒకటి. నువ్వు నాకు నచ్చావ్ సినిమాకు మాటల రచయితగా పనిచేసి తనకంటూ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ను సంపాదించుకున్నాడు త్రివిక్రమ్. ఇక ఆ తరువాత వీరిద్దరి కాంబోలో వచ్చిన మల్లీశ్వరి ఏ రేంజ్ హిట్ ను అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ కామెడీ కానీ, కథ కానీ నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఈ కాలంలో అలాంటి కామెడీ రావడం చాలా అరుదు.


కుర్ర హీరోలతో బిజీగా త్రివిక్రమ్.. కుర్ర డైరెక్టర్లతో బిజీగా వెంకీ మామ మారిపోవడంతో వీరిద్దరి మధ్య ఒక కాంబో మరోసారి రిపీట్ అవుతుందా అనే అనుమానం కూడా రాకమానలేదు. ఎట్టకేలకు మరోసారి గురూజీ - వెంకీ మామ ఒక్కట్టయ్యారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ఈ ఏడాది బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్న వెంకీ.. ఆ తరువాత గురూజీ సినిమాను పట్టాలెక్కించడానికి సిద్దమయ్యాడు. పుష్ప 2 తరువాత అల్లు అర్జున్ తో సినిమా మొదలుపెడదామని సిద్దమైన గురూజీకి షాక్ తగిలింది. గురూజీని పక్కన పెట్టి బన్నీ.. అట్లీతో సినిమా మొదలుపెట్టాడు.


ఇక దీంతో చేసేదేమి లేకగురూజీ మధ్యలో ఉన్న గ్యాప్ ని ఫిల్ల్ చేయడానికి ఎప్పటినుంచో చర్చల్లో ఉన్న వెంకీ మామ కథను బయటకు తీసి ఫైనల్ చేశాడు. ఇప్పటికే వీరిద్దరి కాంబో అధికారికం అన్న విషయం అందరికీ తెల్సిందే. నేడు స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా వెంకేటేష్ 77 వ సినిమాను పూజా కార్యక్రమాలతో మొదలుపెట్టారు. వెంకటేష్ - త్రివిక్రమ్ కొత్త సినిమా పూజా నేడు ఘనంగా జరిగింది. ఈ సినిమాను హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై చినబాబు నిర్మిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూట్ ప్రారంభం కానుందని మేకర్స్ తెలిపారు.వెంకీ - గురూజీ మార్క్ కు తగ్గట్టే ఈ సినిమా కూడా ఉండబోతుందని మేకర్స్ తెలిపారు. మరి ఈ సినిమాతో గురూజీ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

WAR2 Jr Ntr: పని చేయించుకుని పక్కన పెట్టడం కాదు.. వార్2 డైలాగ్స్‌ ఎవ‌రిని ఉద్దేశించి!

Karthik Aaryan: చక్ దే ఇండియా డైరెక్ట‌ర్‌తో.. కార్తీక్ ఆర్య‌న్‌

Updated Date - Aug 15 , 2025 | 02:09 PM