OG నుంచి క్రేజీ అప్డేట్.. సువ్వి సువ్వి వచ్చేస్తోంది
ABN , Publish Date - Aug 24 , 2025 | 04:30 PM
పవన్ కల్యాణ్ (Pawan Kalyan), ప్రియాంక మోహన్ జంటగా రూపొందుతున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ చిత్రం ఓజీ.
పవన్ కల్యాణ్ (Pawan Kalyan), ప్రియాంక మోహన్ (Priyanka arul mohan) జంటగా రూపొందుతున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ చిత్రం ఓజీ (OG). ఆర్ ఆర్ ఆర్ వంటి భారీ బ్లాక్ బ్లస్టర్ చిత్రం తర్వాత డీవీవీ దానయ్య (Dvv Danayya) ఈ చిత్రాన్ని నిర్మిస్తోండగా పాహో ఫేం సుజిత్ (Sujeeth) దర్శకత్వం వహిస్తున్నాడు.
ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మరో నెల రోజుల్లో థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రచార కార్యక్రమాలకు తెర లేపారు. ఈ ్రమంలో ఆదివారం ఈ సినిమా నుంచి ఓ ప్రత్యేక అప్డేట్ ఇచ్చింది చిత్ర బృందం. ఇప్పటి విడుదల చేసిన పోస్టర్లు, గ్లింప్స్, పాటలు సినిమాపై అంచనాలను రెట్టింపు చేయడంతో ఇప్పుడు ఈ అప్డేట్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఈ మూవీ నుంచి సువ్వీ సువ్వీ (Suvvi Suvvi) అంటూ సాగే పాటను వినియక చవితి పర్వదిన్నాన్ని పురస్కరించుకుని ఆగస్టు 27 న రిలీజ్ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టర్ సైతం విడుదల చేయగా ఇప్పుడది నెట్టింట బాగా వైరల్ అవుతుంది. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి పవన్ మాస్‌లుక్స్ రిలీజ్ చేసి యూత్‌లో అదిరిపోయే క్రేజ్ తీసుకు వచ్చిన మేకర్స్ తాజాగా రివీల్ చేసిన పోస్టర్ అందుకు భిన్నంగా సాత్వికంగా ఉండి కథానాయికతో కలిసి కోలనులో దీపాలు వదులుతున్న లుక్ అదిరిపోయింది.
ఈ పోస్టర్ చూసిన పవన్ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. అయితే పవన్ కల్యాణ్ గత సినిమాలు తీన్‌మార్, కాటమరాయుడు చిత్రాలలోనూ కథానాయికలతో దీపాలు వెలిగించే సన్నివేశాల ఉండడం విశేషం. ఇప్పుడు తిరిగి మరోసారి దేవాలయంలో అలాంటి సీనే ఉండడంతో పలువురు పాత పోస్టర్లను షేర్ చేస్తున్నారు.