NBK: వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గోల్డ్ ఎడిషన్‌లో స్థానం
ABN , Publish Date - Aug 24 , 2025 | 04:01 PM
నందమూరి బాలకృష్ణకు (NBK) అరుదైన గౌరవం దక్కింది. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గోల్డ్ ఎడిషన్‌లో ఆయన పేరు నమోదైంది.
నందమూరి బాలకృష్ణకు (NBK) అరుదైన గౌరవం దక్కింది. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గోల్డ్ ఎడిషన్‌లో ఆయన పేరు నమోదైంది. భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ఈ పురస్కారానికి ఎంపికైన తొలి నటుడిగా నిలిచారు బాలయ్య. సినీ ఇండస్ట్రీలో నటుడిగా 50 వసంతాలు పూర్తి చేసుకున్నారాయన. సినిమా ఇండస్ట్రీకి ఆయన చేసిన సేవలను గుర్తించి ఆయనకు ఈ పురస్కారాన్ని అందించనున్నారు. (World Book of Records)
ఈ నెల 30న బాలయ్యను ఈ పురస్కారంతో సత్కరించనున్నారు. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సిఇఓ సంతోష్ శుక్లా అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించారు. బాలయ్య 5 దశాబ్దాల జర్నీ ఎందరికో స్ఫూర్తి అని ఆయన కొనియాడారు. నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకున్న ఈ తరుణంలో ఈ గుర్తింపు దక్కడం ఆయన కెరీర్‌కు ఓ మైల్‌స్టోన్ అనే చెప్పాలి. అభిమానులు, సెలెబ్రిటీలు బాలయ్యకు శుభాకాంక్షలు చెబుతున్నారు
టాలీవుడ్ కు అయన చేసిన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారంతో బాలకృష్ణను సత్కరించింది. ఇటీవల ప్రకటించిన 71వ జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో..అయన నటించిన ‘భగవంత్ కేసరి’ ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. ఇప్పుడు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కడంపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.