సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Bigg Boss: సల్లూ భాయ్ కోసం మైక్ టైసన్

ABN, Publish Date - Aug 22 , 2025 | 06:15 PM

బిగ్ బాస్ బిగ్ సెన్సేషన్ సృష్టించేందుకు సిద్ధమవుతోందా... ఎవరూ ఊహించని కంటెస్టెంట్లతో దుమ్ము రేపబోతోందా.. ఈసారి షోను నేషనల్ వైడ్ కాదు ఏకంగా గ్లోబల్ వైడ్ గా మార్చాలని మేకర్స్ రెడీ అవుతున్నారా.. అంటే అవుననే ఆన్సర్ వస్తోంది.

బిగ్‌బాస్ హిందీ (Bigg Boss) రియాల్టీ షోకు క్రేజ్ మామూలుగా ఉండదు. ప్రతి సంవత్సరం కొత్త సీజన్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తారు. కండల వీరుడు సల్మాన్ ఖాన్ (Salman Khan) హోస్ట్‌గా వ్యవహరిస్తూ... షోకి ప్రత్యేక ఆకర్షణను తీసుకొస్తున్నారు. 18 సీజన్‌లను విజయవంతంగా పూర్తి చేసిన ఈ షో, ఇప్పుడు 19వ సీజన్‌తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రతి సీజన్‌లోనూ నిర్మాతలు కొత్త ఆలోచనలతో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు కష్టపడతారు. ఈసారి కూడా సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా కొనసాగుతుండగా, ప్రముఖ కంటెస్టెంట్లతో పాటు ఆశ్చర్యకరమైన గెస్టులు షో ని మరింత రసవత్తరం చేయనున్నారని తెలుస్తోంది.


బిగ్ బాస్ సీజన్‌19ను నెవర్ బిఫోర్ అనేలా మార్చేందుకు నిర్మాతలు ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచ ప్రసిద్ధ బాక్సర్ మైక్ టైసన్‌ (Mike Tyson) ను షో లో భాగం చేయాలని అనుకుంటున్నారు. బాక్సింగ్ లెజెండ్ ఇటీవల రియాలిటీ షోలలో కనిపించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. బిగ్‌బాస్ నిర్మాతలు ఆయన్ను ఒకటి లేదా రెండు వారాల పాటు షో ఉండేలా ఒప్పించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. టైసన్ లాంటి సెలబ్రిటీ ఈ షోలో చేరితే.. అది ప్రేక్షకులను ఉర్రూతలూగించే అంశం అవుతుందని నిర్మాతలు భావిస్తున్నారట. ఆయన రెమ్యూనరేషన్ భారీగా ఉన్నప్పటికీ, ఈ అవకాశం షో రేటింగ్‌లను ఆకాశానికి తాకేలా చేస్తుందని వారి నమ్మకం.

మరోవైపు మైక్ టైసన్‌కు భారత్‌లో భారీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. గతంలో ఆయన కొన్ని ఇండియన్ షోలలో కనిపించారు. అలానే విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) నటించిన ‘లైగర్’ (Liger) సినిమాలో ఆయన ఒక పాత్రలో కనిపించారు. ఇప్పుడు బిగ్ బాస్ నిర్మాతలు ఆయన టీమ్‌తో చర్చలు ప్రారంభించినట్లు సమాచారం. టైసన్ లాంటి విశ్వవిఖ్యాత వ్యక్తి బిగ్‌బాస్‌లో కనిపిస్తే, షో ఆరంభానికి ముందే సంచలనం సృష్టించే అవకాశం ఉంది. ముఖ్యంగా, షో ప్రారంభం లేదా గ్రాండ్ ఫినాలేలో ఆయన రాక ఈ సీజన్‌ను గత సీజన్‌లను మించిన స్థాయిలో నిలిపే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.

Read Aslo:Bunny: ఐకాన్ స్టార్ తో చేతులు కలుపుతున్న విజయ్ సేతుపతి

Read Aslo:Thalapathy Vijay: తమన్ పై నమ్మకం..

Updated Date - Aug 22 , 2025 | 06:29 PM