సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Meenakshi Chaudhary: మీనూ పాప.. బాలీవుడ్ ఎంట్రీ ఇస్తుందిరోయ్

ABN, Publish Date - Sep 27 , 2025 | 06:09 PM

సాధారణంగా హీరోయిన్లు.. ఒక భాషలో హిట్ అయితే అందులోనే కొనసాగకుండా.. వేరే భాషల్లో కూడా సత్తా చాటడానికి సిద్దమవుతూఉంటారు.

Force 3

Meenakshi Chaudhary: సాధారణంగా హీరోయిన్లు.. ఒక భాషలో హిట్ అయితే అందులోనే కొనసాగకుండా.. వేరే భాషల్లో కూడా సత్తా చాటడానికి సిద్దమవుతూఉంటారు. టాలీవుడ్ లో స్టార్ గా ఎదిగాకా హీరోయిన్లందరూ బాలీవుడ్ వైపే మొగ్గు చూపుతూ ఉంటారు. ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ గా కొనసాగుతున్న వారందరూ కూడా హిందీలో తమ సత్తా చూపిస్తున్న వారే. తాజాగా ఆ లిస్ట్ లోకి మీనాక్షీ చౌదరి కూడా చేరింది.


ఇచట వాహనములు నిలుపరాదు అనే సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన ఈ భామ నెమ్మదిగా తెలుగులో స్టార్ హీరోయిన్ గా మారింది. లక్కీ భాస్కర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు అమ్మడిని టాలీవుడ్ అభిమానులకు మరింత దగ్గర చేశాయి. ఇక ప్రస్తుతం మీనాక్షీ తెలుగులో అనగనగా ఒక రాజు సినిమాలో నటిస్తుంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది.


ప్రస్తుతం మీనాక్షీ బాలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్దం చేసింది. బాలీవుడ్ స్టార్ హీరో జాన్ అబ్రహాం నటించిన ఫోర్స్ ఫ్రాంచైజీని కొనసాగిస్తున్న విషయం తెల్సిందే. ఇప్పటికే ఫోర్స్, ఫోర్స్ 2 సినిమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక వాటికి సీక్వెల్ గా ఫోర్స్ 3 తెరకెక్కనుంది. భావ్ ధులియా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా మీనాక్షీ చౌదరి ఎంపిక అయ్యిందని వార్తలు వస్తున్నాయి. ఇదే కనుక నిజం అయితే అమ్మడి పంట పండినట్టే. త్వరలోనే మేకర్స్ అధికారిక ప్రకటన చేయనున్నారని తెలుస్తోంది. మరి ఈ సినిమాతో ఈ ఉత్తరాది భామ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

PuriSethupathi: బెగ్గర్ పోయింది.. స్లమ్ డాగ్ వచ్చింది

Hollywood: రిపీట్ రన్స్ తో ఆదాయం పొందుతున్న నటీనటులు

Updated Date - Sep 27 , 2025 | 07:22 PM