Actress: నటి రాజసులోచన 91వ జయంతి... సేవా కార్యక్రమాలు
ABN , Publish Date - Aug 17 , 2025 | 01:27 PM
అలనాటి మేటి నటి రాజసులోచన 91వ జయంతి వేడుకలు రోటరి డిస్ట్రిక్ట్స్ 3232, ఎఫ్.ఎం.ఎల్, ఆర్., ఎన్.జి.ఎల్. ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో చెన్నయ్ లో ఇటీవల ఘనంగా జరిగాయి.
అలనాటి మేటి నటి రాజసులోచన 91వ జయంతి వేడుకలు రోటరి డిస్ట్రిక్ట్స్ 3232, ఎఫ్.ఎం.ఎల్, ఆర్., ఎన్.జి.ఎల్. ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ఇటీవల ఘనంగా జరిగాయి. మైలాపూర్ లో ఆంధ్ర మహిళా సభలో జరిగిన ఈ కార్యక్రమానికి రాజసులోచన కుమార్తె, రొటేరియన్ దేవికృష్ణ అధ్యక్షత వహించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా సీనియర్ నటీమణి ఋష్యేంద్రమణి మనవరాలు, నటి భవానీ హాజరయ్యారు. తొలుత నిర్వాహకులు రాజసులోచన చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం నటి భవానికి రాజసులోచన పేరుతో సత్కారం చేశారు.
ఈ సందర్భంగా నటి భవానీ మాట్లాడుతూ, 'తన బామ్మ ఋష్యేంద్రమణి, రాజసులోచన నటించిన తెలుగు, తమిళ చిత్రాలు ఇప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయన్నారు. తమ తల్లి రాజసులోచన జయంతిని గత ఆరేళ్లుగా నిర్వహిస్తూ సినీ రంగ ప్రముఖులను సత్కరిస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్ సభ్యులు అలనాటి సినిమా పాటలను పాడి వినిపించారు. ఇందులో భాగంగా చూలైమేడులోని థాయికడంగళ్ ఆశ్రమానికి చెందిన అంధులైన మహిళలకు చీరలు, అల్పాహరం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నటులు నంబియార్, ఆర్ఎస్ మనోహర్ కుటుంబ సభ్యులు, పారిశ్రామిక వేత్త శోభారాజా తదితరులు పాల్గొన్నారు.
Also Read: Bobby Deol: స్టార్ హీరోయిన్ నోటి నుంచి గబ్బు వాసన.. ముద్దు పెట్టనన్న యానిమల్ విలన్
Also Read: కుక్కల బెడద నివారణకు వర్మ మార్క్ సొల్యూషన్స్...