Shilpa Shetty: చీటింగ్ కేస్.. శిల్పాశెట్టి దంపతులకు లుకౌట్ నోటీసులు
ABN, Publish Date - Sep 05 , 2025 | 05:21 PM
బాలీవుడ్ హాట్ బ్యూటీ శిల్పా శెట్టి(Shilpa Shetty).. ఆమె భర్త రాజ్ కుంద్రా (Raj Kundra) లీగల్ సమస్యలను ఎదుర్కుంటున్న విషయం తెల్సిందే.
Shilpa Shetty: బాలీవుడ్ హాట్ బ్యూటీ శిల్పా శెట్టి(Shilpa Shetty).. ఆమె భర్త రాజ్ కుంద్రా (Raj Kundra) లీగల్ సమస్యలను ఎదుర్కుంటున్న విషయం తెల్సిందే. ఈ మధ్యనే వీరిపై చీటింగ్ కేసు నమోదు అయ్యింది. వ్యాపారవేత్త దీపక్ కొఠారి అనే వ్యక్తి .. శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రా తన వద్ద రూ. 60 కోట్ల తీసుకొని మోసం చేశారని ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వ్యాపారంలో పెట్టుబడులు పెడుతున్నామని నమ్మించి తనవద్ద డబ్బులు తీసుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నాడు.
ఇక దీంతో ముంబై పోలీసులు శిల్పా శెట్టి, రాజ్ కుంద్రాకు లుకౌట్ నోటీసులు జారీ చేయడానికి సిద్దమయ్యినట్లు తెలుస్తోంది. వీరిద్దరూ తరుచుగా విదేశాలకు ప్రయాణిస్తుండడంతో.. ఎక్కడ పారిపోతారేమో అన్న అనుమానంతోపాటు విచారణ జరుగుతున్న సమయంలో అందుబాటులో ఉండకుండా పర్యటనలు చేస్తున్నారని అందుకే లుకౌట్ నోటీసులు జారీ చేయనున్నట్లు పోలీసులు తెలిపారు. అంతేకాకుండా వీరి ట్రావెల్ లాగ్ తో పాటు శిల్పా శెట్టి కంపెనీ ఆడిటర్ ను ను కూడా విచారిస్తున్నట్లు తెలిపారు.
ఇక ఈ మధ్యనే శిల్పా శెట్టి ముంబైలో తనకున్న పెద్ద రెస్టారెంట్ బాస్టియన్ బాంద్రాను మూసివేసింది. నిన్న గురువారం బాస్టియన్ లో పెద్ద పార్టీ కూడా జరిగింది. అయితే ఈ బాస్టియన్ మూసివేయడానికి,చీటింగ్ కేసుకు సంబంధం ఉందని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. మరి ఈ కేసు నుంచి ఈ దంపతులు ఎలా బయటపడతారో చూడాలి.
RGV: దావుద్ ఇబ్రహీం కూడా నా గురువే అంటున్న ఆర్జీవీ
Onam Celebrations: ఓనమ్ పండగ.. చీరల్లో మెరిసిపోతున్న హీరోయిన్స్