Kiara Advani: కియారా దెబ్బ.. తగలబడుతోన్న సోషల్‌మీడియా
ABN , Publish Date - Jul 31 , 2025 | 08:21 PM
హృతిక్ రోషన్, ఎన్టీఆర్, కియారా అద్వాని కాంబోలో తెరకెక్కిన చిత్రం వార్2 నుంచి తాజాగా హిందీలో ఆవన్ జావన్, తెలుగులో ఊపిరి ఉయ్యాల రొమాంటిక్ పాటను రిలీజ్ చేశారు.
హృతిక్ రోషన్ (Hrithik Roshan), జూ. ఎన్టీఆర్(Jr Ntr), కియారా అద్వాని (Kiara Advani) కలయికలో రూపుదిద్దుకున్న భారీ బాలీవుడ్ ప్రాజెక్ట్ వార్2 (War 2). బ్రహ్మాస్త్ర ఫేమ్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించాడు. ఆగస్టు 14న థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో మేకర్స్ కియారా జన్మదినాన్ని పురస్కరించుకుని మేకర్స్ ఒక మ్యూజికల్ సర్ప్రైజ్ ఇచ్చారు.
హిందీలో ఆవన్ జావన్ పేరుతో తెలుగులో ఊపిరి ఉయ్యాలగా అంటూ సాగే రొమాంటిక్ పాటను రిలీజ్ చేశారు. ఇటలీలో అందమైన లోకేషన్లలో ఈ పాట వినడానికి, చూడడానికి అద్భుతంగా ఉండడంతో సోషల్ మీడియాలో దూసుకు పోతుంది. పాట సంగీతం, విజువల్స్ అన్ని వైరల్‌గా మారాయి. ఆన్ స్క్రీన్ లో హీరో హీరోయిన్లు హృతిక్ రోషన్.. కియారా అద్వానీల మధ్య కెమిస్ట్రీ అదిరిపోయింది.
అయితే ఇప్పుడు ఈ పాట మొత్తం ప్రపంచాన్నే షేక్ చేస్తుంది. ముఖ్యంగా నెట్టింట పెద్ద దుమారమే రేపుతోంది. అందుకు కారణం పాటలో కియారా అద్వాని (Kiara Advani) ధరించిన దుస్తులు అనడంతో ఎలాంటి సందేహం లేదు.
ఒక్క పాటలో డజన్‌కు పైగా ఔట్‌ఫిట్స్ మార్చిన కియారా ప్రతి దాంట్లోనూ చాలా పొదుపు పాటించి వీక్షకులకు ఫుల్ మీల్స్ వడ్డించింది. ఇంకా చెప్పాలంటే ఆ పాటలో బికినీ సీన్స్ హైలెట్‌గా నిలిచి చూసే వారికి రెండు కళ్లు చాలవు అనేలా ఉంది. అంతగా ఆ పాటలో గ్లామర్ సన్నివేశాలు హైలెట్ అయ్యాయి.
పాట చూసిన ప్రేక్షకులు తమ చూపును విడిచిపెట్టలేకపోతున్నారు. ఇప్పుడు ఈ పాటలోని కియారాకు సంబంధించిన పాటలు, వీడియో క్లిప్పులు, స్టిల్స్, బీహైండ్ ది సీన్స్ ఫుటేజ్‌లు సామాజిక మాధ్యమంలో నేషనల్ లెవల్‌లో టాప్‌లో ట్రెండింగ్ అవుతున్నాయి.
అవి ఓ రేంజ్‌లో కుర్రకారుతో పాటు పెద్ద వాళ్లను సైతం కవ్వించేలా ఉన్నాయి. ఒక్క సారి చూసిన వారు కళ్లు తిప్పుకోకుండా పదే పదే వాటినే చూసి ఆస్వాదిస్తున్నారు. కియారా (Kiara Advani) గ్లామర్‌తో పాటు సంగీతం, విజువల్ ప్రెజెంటేషన్ కూడా యువతను బాగా ఆకట్టుకుంటోంది.