సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Katrina Kaif: తల్లి కాబోతున్న కత్రీనా కైఫ్.. ?

ABN, Publish Date - Sep 15 , 2025 | 05:24 PM

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రీనా కైఫ్ (Katrina Kaif) తల్లి కాబోతుందని ఎప్పటినుంచో ఒక వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విషయం తెల్సిందే.

Katrina Kaif

Katrina Kaif: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రీనా కైఫ్ (Katrina Kaif) తల్లి కాబోతుందని ఎప్పటినుంచో ఒక వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విషయం తెల్సిందే. కత్రీనా.. కోస్టార్ అయినా విక్కీ కౌశల్ (Vicky Kaushal) ను 2021లో ప్రేమించి పెళ్లి చేసుకుంది. అప్పటి నుంచి ఇప్పటివరకు కత్రీనా కొన్నిరోజులు మీడియా ముందుకు కనిపించకపోవడం ఆలస్యం ఆమె ప్రెగ్నెంట్ అని రూమర్స్ సృష్టించేస్తున్నారు. అంతేకాకుండా ఎయిర్ పోర్ట్ లో లూజ్ డ్రెస్ తో కనిపించినా.. కొద్దిగా లావు అయ్యి కనిపించినా తల్లి కాబోతుందని వార్తలు పుట్టిస్తున్నారు.


అయితే కత్రీనా మాత్రం గత నాలుగేళ్లుగా తన ప్రెగ్నెన్సీ రూమర్స్ ను ఎప్పటికప్పుడు ఖండిస్తూనే వస్తుంది. రూమర్స్ వచ్చిన తరువాతి రోజునే విక్కీతో కలిసి స్విమ్ సూట్ లోనో.. లేక పొట్ట కనిపించే డ్రెస్ లోనో ఫోటోలు పెట్టి అవేమి నిజం కాదని చెప్పుకొచ్చేది. కానీ, ఇప్పుడు మాత్రం నిజంగానే కత్రీనా ప్రెగ్నెంట్ అయ్యిందని బాలీవుడ్ కోడై కూస్తోంది. ఇక ఈ వార్తలపై విక్కీ కూడా స్పందించకపోవడం ఈ వార్తలకు ఆజ్యం పోసింది. దీంతో నిజంగానే కత్రీనా తల్లి కాబోతుందని తెలుస్తోంది.


ముఖ్యంగా కత్రీనా ఈ మధ్య బయట ఎక్కడా కనిపించలేదు. ఎయిర్ పోర్ట్ లో కూడా ఆమె కనిపించడం మానేసింది. అంతేకాకుండా రెండు రోజుల క్రితం ఒక వీడియోను పోస్ట్ చేయగా అందులో అమ్మడు కొద్దిగా బరువు పెరిగి.. పొట్ట పెరిగి కనిపించడం ఈ అనుమానాలకు మరింత తావిచ్చింది. దీంతో కత్రీనా కచ్చితంగా ప్రెగ్నెంట్ అని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఇక గత కొన్ని నెలలుగా ఆమె ఎలాంటి సినిమాను ఓకే చేసింది లేదు. కనీసం యాడ్స్ లో కనిపించలేదు. ప్రస్తుతం కత్రీనా ఇంట్లో రెస్ట్ తీసుకుంటుందని త్వరలోనే ఈ విషయాన్నీ విక్కీ - కత్రీనా అధికారికంగా అభిమానులకు తెలుపనున్నారని సమాచారం. ఇక ఈ విషయం తెలియడంతో నెటిజన్స్ అప్పుడే కత్రీనాకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Meena Sagar: భర్త చనిపోయిన వారానికే రెండో పెళ్లి.. మీనా ఏం చెప్పిందంటే

Uprendra: నా ఫోన్‌ హ్యాక్‌ అయింది.. కాల్స్‌ వస్తే స్పందించకండి..

Updated Date - Sep 15 , 2025 | 05:24 PM