Karan Johar: 26 ఏళ్ల వయస్సులో నా వర్జినిటీ కోల్పోయాను..
ABN, Publish Date - Oct 24 , 2025 | 04:34 PM
బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ (Karan Johar) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Karan Johar: బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ (Karan Johar) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వివాదాలు సృష్టించడంలో కరణ్ మొదటి వరసలో ఉంటాడు. కాఫీ విత్ కరణ్ అనే టాక్ షోతో ఎన్ని వివాదాలు సృష్టించాడు అనేది అందరికీ తెలుసు. ఇప్పుడు అలాంటి ఇంకో షోకు ఈ నిర్మాత గెస్ట్ గా విచ్చేశాడు. బాలీవుడ్ హాట్ హీరోయిన్స్ కాజోల్ మరియు ట్వింకిల్ ఖన్నా కలిసి టూ మచ్ విత్ కాజోల్ అండ్ ట్వింకిల్ అనే షో చేస్తున్న విషయం తెల్సిందే.
ఇక ఈ షో కూడా కాఫీ విత్ కరణ్ కి తీసిపోలేదు. సెలబ్రిటీల ఎఫైర్లు, రొమాన్స్.. గొడవలు ఇవే ఉన్నాయి. అయినా కూడా కాజోల్, ట్వింకిల్.. సెలబ్రిటీలను అడిగే తీరు చాలా బాగా ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ షోకు నిర్మాత కరణ్ జోహార్, హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ జంటగా హాజరయ్యారు. ఇక వీరిని కాజోల్, ట్వింకిల్ ఆడుకున్నారు. ముఖ్యంగా కరణ్ ను నెక్స్ట్ లెవెల్ లో ఏడిపించారు. ఇందులో కరణ్ ను ఒక ప్రశ్న అడిగారు.
మీరు రెండు సీక్రెట్స్ చెప్పండి. అందులో ఏది నిజం ఏది అబద్దం అని గెస్ట్ చేస్తాం అని అడగ్గా.. కరణ్.. నేను 26 ఏళ్ల వయస్సులో వర్జినిటీ కోల్పోయాను. జాన్వీ వాళ్ల ఫ్యామిలీ మెంబర్స్ తో సన్నిహితంగా ఉన్నాను అని చెప్పాడు. దానికి జాన్వీ అవాక్కయ్యింది. కరణ్ కేవలం పురుషులనే ఇష్టపడతాడు అన్న విషయం అందరికీ తెల్సిందే. దీంతో జాన్వీ తన ఇంట్లో ఎవరు అని షాక్ అయ్యింది. ఆ తరువాత కరణ్.. వర్జినిటీ విషయం నిజమని, జాన్వీ కుటుంబ సభ్యులతో తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపాడు. అంతేకాకుండా రెండు మూడు సార్లు అలా చేయాలనీ అనిపించినా కూడా చేయలేదని చెప్పాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
Tollywood: సినీ కార్మికుల సమస్యకు త్వరలో శాశ్వత పరిష్కారం
Kurnool Bus accident: కర్నూల్ బస్సు ప్రమాదం.. మోహన్‌బాబు విచారం