సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Bollywood: కాజోల్ అంత మాట అనేసిందేమిటీ...

ABN, Publish Date - Nov 13 , 2025 | 04:14 PM

టూ మచ్ విత్ కాజోల్ అండ్ ట్వింకిల్ కార్యక్రమంలో వివాహ వ్యవస్థపై కాజోల్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. వివాహానికి ఎక్స్ పైరీ డేట్ అవసరం అని కాజోల్ అభిప్రాయపడటాన్ని నెటిజన్స్ తప్పు పడుతున్నారు.

Kajol

బాలీవుడ్ స్టార్ యాక్ట్రస్ కాజోల్ (Kajol) ఒక్కోసారి చేసే వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిపోతుంటాయి. అలానే ఆమె చేసే పాత్రలు కూడా చర్చనీయాంశంగా మారుతుంటాయి. ప్రస్తుతం సీనియర్ నటీమణులు కాజోల్, ట్వింటిల్ ఖన్నా (Twinkle Khanna) ఇద్దరూ కలిసి 'టూ మచ్ విత్ కాజోల్ అండ్ ట్వింకిల్' అనే కార్యక్రమాన్ని హోస్ట్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో అంశాలు సైతం పేరుకు తగ్గట్టే టూ మచ్ గానే ఉంటాయి. తాజాగా ఈ కార్యక్రమానికి హీరో విక్కీ కౌశల్ (Vicky Kaushal), కృతి సనన్ (Kriti Sanon) గెస్టులుగా హాజరయ్యారు. ఈ షోలో కాజోల్ వివాహ వ్యవస్థపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో అగ్గి రాజేస్తున్నాయి.


ఒకానొక సందర్భంలో ట్వింకిల్ ఖన్నా 'వివాహానికి గడువు తేదీ ఉండాలా? అలానే దానికి కూడా రెన్యువల్ ఆప్షన్ ఉండాలా?' అని ప్రశ్నించింది. నిజానికి ట్వింకిల్ తో పాటు ఈ షోలో పాల్గొన్న విక్కీ కౌశల్, కృతీససన్ దానికి వ్యతిరేకంగా మాట్లాడారు. వివాహం అనేది వాషింగ్ మిషన్ లాంటిది కాదని అలాంటి వాటికి ఎక్స్ పైరీ డేట్ ఉంటుందేమో కానీ పెళ్ళికి కాదని సమాధానం చెప్పారు. అయితే కాజోల్ అభిప్రాయం మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. వివాహ బంధానికి సైతం ఎక్స్ పైరీ డేట్ ఉంటే మంచిదని, ఇష్టం లేని వ్యక్తి పెళ్ళి చేసుకుని జీవితకాలమంతా భరించడం కరెక్ట్ కాదని కాజోల్ అభిప్రాయపడింది. అలానే రెన్యువల్ ఆప్షన్ ఉండటంలో తప్పులేదని చెప్పింది. కాజోల్ ఇచ్చిన ఈ బోల్డ్ స్టేట్ మెంట్ ను కొందరు సమర్థిస్తుంటే, అత్యధికులు వ్యతిరేకిస్తున్నారు. చిత్రం ఏమంటే... కాజోల్ నటుడు అజయ్ దేవ్ గన్ ను ప్రేమించి పెళ్ళి చేసుకోగా, ట్వింటిల్ ఖన్నా నటుడు అక్షయ్ కుమార్ ను ప్రేమించి పెళ్ళి చేసుకుంది.

Also Read: Ruhani Sharma: ఎట్టకేలకు థియేటర్స్‌కి రుహానీ శర్మ బోల్డ్‌ సినిమా...

Also Read: Rana Daggubati: చిరకాల కోరిక తీర్చుకోబోతున్న రానా...

Updated Date - Nov 13 , 2025 | 04:15 PM