సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Janhvi Kapoor: నాకు పెళ్లయ్యింది.. అతడే నా భర్త.. షాక్ ఇచ్చిన జాన్వీ

ABN, Publish Date - Aug 29 , 2025 | 06:12 PM

బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) ప్రస్తుతం తెలుగు, హిందీ భాషల్లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా మారిన విషయం తెల్సిందే.

Janhvi Kapoor

Janhvi Kapoor: బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) ప్రస్తుతం తెలుగు, హిందీ భాషల్లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా మారిన విషయం తెల్సిందే. తెలుగులో దేవర(Devara) సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ తాజాగా పెద్ది సినిమాలో నటిస్తోంది. ఇక ఈ సినిమాతో తెలుగులో జాన్వీ స్టార్ హీరోయిన్ అవ్వడం గ్యారెంటీ అని తెలుగు ప్రేక్షకులు చెప్పుకొస్తున్నారు. అమ్మడి సినిమాల విషయం పక్కన పెడితే.. జాన్వీ పెళ్లి చేసుకుంది.. ఆమె భర్తను కూడా పరిచయం చేసింది. ఏంటి.. నిజమా ఇదెప్పుడు జరిగింది అని మాత్రం కంగారుపడకండి. ఆకతాయిల అల్లరి తట్టుకోలేక ఈ చిన్నది పెళ్లయిందని అబద్ధమాడింది అంతే.


జాన్వీ అందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందాల అతిలోక సుందరి శ్రీదేవి అందాన్ని మొత్తం పుణికిపుచ్చుకుంది జాన్వీ. ఈ దేశంలోనే కాదు.. విదేశీ అబ్బాయిలు కుడా జాన్విని చూసిన మొదటి చూపులోనే ప్రేమలో పడిపోతారు. అమ్మడి వెనుక పెద్ద క్యూనే ఉంది. అలా అమెరికాకి వెకేషన్ కి వెళ్తే.. కొంతమంది వెయిటర్లు తనను ఫ్లర్ట్ చేసినట్లు జాన్వీ చెప్పుకొచ్చింది.


' అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో కొంతమంది వెయిటర్స్ నన్ను విపరీతంగా ఫ్లర్ట్ చేశారు. వారి ఫోన్ నెంబర్స్ ఇచ్చేవారు. నాకు ఇష్టమైన వంటకాలు నేను అడగకముందే తీసుకొచ్చేవారు. ఈ ఫ్లర్టింగ్ తట్టుకోలేక ఒకసారి ఓర్రీతో ఉన్నప్పుడు.. ఇతనితో నాకు పెళ్లి అయ్యిందని, ఇతనే నా భర్త అని పరిచయం చేశాను. ఇలా ఎన్నోసార్లు నాకు పెళ్లి అయ్యిందని అబద్దాలు ఆడాను" అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.


ఇక నిజంగా జాన్వీ పెళ్లి విషయానికొస్తే.. ప్రస్తుతం అమ్మడు శిఖర్ పహారియాతో ప్రేమలో తేలుతుంది. త్వరలోనే ఈ జంట పెళ్లి చేసుకుంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. జాన్వీకి పెళ్లి తరువాత చాలా కోరికలు ఉన్నాయి. భర్తతో పాటు తిరుపతిలో సెటిల్ అవ్వాలని, అతనికి రోజు వండిపెట్టాలని, పిల్లలతో ఆనందంగా ఉండాలని ఉన్నట్లు ఆమె ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చింది. త్వరలోనే ఇది నిజం కాబోతుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Mayukham: పూజా కార్యక్రమాలతో 'మయూఖం'

Tamannaah: బీర్ అనేది ఒక ఎమోషన్.. తమన్నా అదరగొట్టింది

Updated Date - Aug 29 , 2025 | 06:14 PM