War -2 : పాట చిత్రీకరణలో...

ABN , Publish Date - Jul 01 , 2025 | 02:33 PM

రెండు కొదమ సింహాల పోట్లాటను సిల్వర్ స్క్రీన్ మీద చూడటానికి ఆడియెన్స్ ఎలా అయితే ఆసక్తి చూపుతారో... ఇద్దరు సూపర్ స్టార్స్ కలిసి డాన్స్ చేస్తే అలానే చూస్తారు. అలాంటి ఓ మెస్మరైజింగ్ సాంగ్ కు 'వార్ -2' మూవీ వేదిక కాబోతోంది.

తెలుగులో ఈ మధ్య కాలంలో చాలానే మల్టీస్టారర్స్ వచ్చాయి. అయితే... అసలు సిసలు మల్టీస్టారర్ అంటే రాజమౌళి (Rajamouli) తెరకెక్కించిన 'ట్రిపుల్ ఆర్' (RRR) అనే అందరూ చెబుతారు. టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్టీఆర్ (Jr NTR), రామ్ చరణ్‌ (Ramcharan) తొలిసారి కలిసి చేసిన ఈ మూవీ తెలుగు ఖ్యాతిని ఆస్కార్ (Oscar) వరకూ తీసుకెళ్ళింది. ఎన్టీఆర్ బేసికల్ గా మంచి డాన్సర్. చిన్నతనం నుండి నృత్యం నేర్చుకున్న వ్యక్తి. అతను సిల్వర్ స్క్రీన్ పై డాన్స్ చేస్తే... ఫ్యాన్స్ కు ఓ పండగ. అలానే రామ్ చరణ్ సైతం బాగా డాన్స్ చేయడానికి కృషి చేస్తుంటాడు. డాన్స్ విషయంలోనూ తండ్రికి తగ్గ తనయుడు అనిపించు కోవాలని తాపత్రయ పడుతుంటాడు. అలాంటి వీరిద్దరూ కలిసి 'ట్రిపుల్ ఆర్'లో చేసిన 'నాటు నాటు' (Naatu Naatu) సాంగ్ ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో... ఏ స్థాయిలో అవార్డులు తెచ్చిపెట్టిందో అందరికీ తెలిసిందే! ఇప్పుడు అలాంటి ఓ సూపర్ డూపర్ డాన్స్ నంబర్ ను 'వార్ -2' కోసం ఆ మూవీ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ పిక్చరైజ్ చేస్తున్నాడు. దీనితో సినిమా షూటింగ్ మొత్తం పూర్తయిపోయినట్టే.


బాలీవుడ్ గ్రీకు వీరుడుగా అభిమానులు చెప్పుకునే హృతిక్ రోషన్ కు డాన్సర్ గా ఉత్తరాదిన మంచి గుర్తింపు ఉంది. అలానే మ్యాన్ ఆఫ్‌ మాసెస్ గా ఎన్టీఆర్ కు సౌత్ లో మంచి పేరుంది. వీరిద్దరూ డాన్స్ లో ఇరగదీస్తారనేది అందరి నమ్మకం. అలాంటి ఇద్దరు డాన్స్ టైకూన్స్ కలిసి ఓ సాంగ్ చేస్తే ఎలా ఉంటుందన్నది ఊహకు అందని విషయం! ముంబైలోని యశ్ రాజ్ స్టూడియోలో ఈ పాట పిక్చరైజేషన్ కోసం భారీ సెట్స్ వేశారు. వారం పాటు ఈ పాట చిత్రీకరణ జరుగబోతోంది. ప్రీతమ్ దీనికి స్వరాలు అందించగా, బాస్కో - సీజర్ ద్వయం కొరియోగ్రఫీ చేస్తోంది. బాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ కు నృత్య రీతులు సమకూర్చిన వీరిద్దరూ... 'వార్' మూవీలోని సూపర్ హిట్ సాంగ్స్ 'గుంగ్రూ, జై జై శివశంకర్' లకూ వర్క్ చేశారు. 'వార్ -2'లో హృతిక్, ఎన్టీఆర్ పాత్రల తీరు వేరు. ఎవరు విలన్, ఎవరు హీరో అనేది ఇంతవరకూ రివీల్ కాలేదు. అయినా... ఒకానొక సందర్భంలో కలిసి డాన్స్ చేసేలా దర్శకుడు అయాన్ ముఖర్జీ ప్లాన్ చేశాడట. సోమవారం ఈ సాంగ్ లీడ్ సీన్ తీసిన ఆయన... మంగళవారం నుండి పాటను చిత్రీకరిస్తున్నారు. ఇది సినిమా మధ్యలో వస్తుందా? లేకపోతే రోలింగ్ టైటిల్స్ లో వేసి, ప్రమోషనల్ సాంగ్ గా విడుదల చేస్తారా? అనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. ఒకవేళ టైటిల్స్ తో పాటు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు, ఎందుకంటే 'ట్రిపుల్ ఆర్'లో అలా వచ్చిన సాంగ్ కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యింది కదా!

Also Read: Rashmika Mandanna: సిగరెట్ తాగుతూ అడ్డంగా దొరికిన రష్మిక.. ఏకిపారేస్తున్న నెటిజన్స్

Also Read: Ram Pothineni: హీరో రామ్ కు తప్పిన ప్రమాదం.. ఇద్దరు వ్యక్తులు తాగి వచ్చి..

Updated Date - Jul 01 , 2025 | 02:33 PM