Ram Pothineni: హీరో రామ్ కు తప్పిన ప్రమాదం.. ఇద్దరు వ్యక్తులు తాగి వచ్చి..
ABN , Publish Date - Jul 01 , 2025 | 01:04 PM
తాజాగా ఇద్దరు వ్యక్తులు.. తగిన మైకంలో హీరో రామ్ (Ram Pothineni) ఉంటున్న హోటల్ రూమ్ వద్దకు వెళ్లి హల్చల్ చేశారు.
Ram Pothineni: ఈమధ్యకాలంలో సెలబ్రిటీలకు సేఫ్టీ లేకుండా పోతుంది. కొంతమంది తెలివిమీరీపోతున్నారు. తాగిన మత్తులో ఏం చేస్తున్నారో మరికొందరికి అర్ధం కావడం లేదు. తాజాగా ఇద్దరు వ్యక్తులు.. తగిన మైకంలో హీరో రామ్ (Ram Pothineni) ఉంటున్న హోటల్ రూమ్ వద్దకు వెళ్లి హల్చల్ చేశారు. రామ్ పోతినేని ప్రస్తుతం ఆంధ్రా కింగ్ తాలూకా (Andhra King Taluka) సినిమాతో బిజీగా ఉన్నాడు. మహేష్ బాబు పి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో రామ్ సరసం భాగ్యశ్రీ బోర్సే నటిస్తుండగా.. ఉపేంద్ర కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టైటిల్ టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ప్రస్తుతం ఆంధ్రా కింగ్ తాలూకా సినిమా రాజమండ్రిలో షూటింగ్ జరుపుకుంటుంది. దీంతో రాజమండ్రిలోని షెరటాన్ హోటల్ లో చిత్ర బృందం బస చేశారు. రామ్ వీఐపీ రూమ్ లో ఉండగా మిగతావారు నార్మల్ రూమ్ లో బస చేశారు. రామ్ దగ్గరకి వెళ్ళాలి అంటే లిఫ్ట్ యాక్సెస్ కావాలి. ఆ విషయం తెలుసుకున్న ఇద్దరు వ్యక్తులు గతరాత్రి 10 గంటల సమయంలో ఎంతో తెలివిగా హోటల్ మేనేజ్ మెంట్ వద్దకు వచ్చి తాము చిత్రబృందమని, తమకు లిఫ్ట్ యాక్సెస్ కావాలని కోరారు. చిత్ర యూనిట్ అని చెప్పడంతో ముందు వెనుకా ఆలోచించకుండా హోటల్ స్టాఫ్ వారికి లిఫ్ట్ యాక్సెస్ ఇచ్చారు.
ఇక లిఫ్ట్ యాక్సెస్ దొరకడంతో నేరుగా రామ్ రూమ్ కి వెళ్లిన ఆ వ్యక్తులు.. తలుపులను దబాదబా బాదడం మొదలుపెట్టారు. అప్పటికే తన రూమ్ లో నిద్రపోతున్న రామ్.. ఆ సౌండ్స్ కి లేచి వెంటనే తలుపుతీయకుండా యూనిట్ కు ఫోన్ చేసి చెప్పడంతో వారు పోలీసులకు సమాచారం అందించినట్లు తెలుస్తోంది. ఇక పోలీసులు హుటాహుటినా హోటల్ కు చేరుకొని ఆ ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. అప్పటికే వారు బాగా తాగేసి ఉన్నారని, రామ్ ని కలవాలనే ప్రయత్నంతోనే ఇదంతా చేశారని సమాచారం. ఇక ఈ వార్త తెలియడంతో అభిమానులు రామ్ డోర్ తీయకపోవడమే మంచిది అయ్యింది. లేకపోతే వారు రామ్ ను ఏం చేసేవారో.. ప్రమాదం తప్పింది అని చెప్పుకొస్తున్నారు.
Thammudu Trailer: ఆసక్తికరంగా తమ్ముడు రిలీజ్ ట్రైలర్..