The Bhootnii: తీసినవాళ్ళకే చెమటలు పట్టించింది...

ABN , Publish Date - May 06 , 2025 | 10:01 AM

సంజయ్ దత్, మౌనీరాయ్ ప్రధాన పాత్రలు పోషించిన 'ది భూత్నీ' చిత్రం మే 1న విడుదలైంది. ఈ హారర్ కామెడీ సినిమా ప్రేకకులను మెప్పించడంలో దారుణంగా ఫెయిల్ అయ్యింది.

బాలీవుడ్ లో గత యేడాది హారర్ కామెడీ సినిమాలకు మంచి ఆదరణ లభించింది. 'స్త్రీ-2' (Stree -2), 'ముంజ్యా' (Munjya), 'భూల్ భులయ్యా -3' (Bhool Bhulaiyaa -3) చిత్రాలు చక్కని విజయాన్ని పొందాయి. దాంతో ఆ జానర్ సినిమాలకు మినిమమ్ గ్యారంటీ అని అంతా నమ్ముతూ వచ్చారు. మేకర్స్ సైతం బిందాస్ గా తమ చిత్రాలను గ్రాండ్ వేలో రిలీజ్ చేయడం మొదలుపెట్టారు. అయితే భారీ తారాగణంతో రూపుదిద్దుకున్న 'ది భూత్నీ' (The Bhootnii) సినిమా బాక్సాఫీస్ బరిలో చతికిల పడి దర్శక నిర్మాతలకే చెమటలు పట్టింది. మే 1న 'ది భూత్నీ' సినిమా 'రైడ్ -2' (Raid -2) తో పోటీపడింది. 'రైడ్ -2'కు కూడా డివైడ్ టాక్ వచ్చినా... బాక్సాఫీస్ కలెక్షన్స్ ఫర్వాలేదనిపించాయి. 'రైడ్' స్థాయిలో ఇది భారీ విజయాన్ని నమోదు చేసుకునే ఛాన్స్ లేకపోయినా... డీసెంట్ కలెక్షన్స్ తో పరువు కాపాడుకుంది. దాంతో అజయ్ దేవ్ గన్ (Ajay Devgn) టీమ్ బతుకు జీవుడా అనుకుంది.


'ది భూత్నీ' దగ్గరకు వచ్చేసరికీ మరీ దారుణమైన ఫలితం దానికి ఎదురైంది. ఈ సినిమాలో సీనియర్ నటుడు సంజయ్ దత్ (Sanjay Dutt), గ్లామర్ యాక్ట్రస్ మౌనీరాయ్ (Mouni Roy), పాలక్ తివారీ కీలక పాత్రలు పోషించారు. అయితే 'దీ భూత్నీ' సినిమా గురవారం ఓపెనిండ్ డేన కేవలం రూ. 40 లక్షల నెట్ ను వసూలు చేసింది. ఆ తర్వాత రెండు రోజులు శుక్ర, శనివారాల్లో వరుసగా రూ. 40 లక్షలు, రూ. 60 లక్షల నెట్ ను సాధించింది. ఇక ఆదివారం రోజు కాస్తంత బెటర్ గా రూ. 75 కోట్ల నెట్ ను వసూలు చేసింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే... సోమవారం ఈ సినిమా మరీ దారుణంగా రూ. 15 లక్షల నెట్ ను వసూలు చేసింది. ఈ రకంగా చూసుకుంటే... ఇప్పటి వరకూ రూ. 2.5 కోట్ల నెట్ ను ఇది దాదాపుగా కలెక్ట్ చేసినట్టు అయ్యింది. సిద్ధాంత్ సచిదేవ్ దర్శకత్వంలో దీపక్ ముకుత్, సంజయ్ దత్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశారు. ఈ మధ్య కాలంలో ఇంత దారుణంగా ఫ్లాప్ అయిన హారర్ కామెడీ మూవీ ఇదేనని బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

Also Read: Kingdom: విజయ్ ఇప్పుడైనా అధిగమిస్తాడా...

Also Read: Super Star: ఘట్టమనేని జయకృష్ణ తెరంగేట్రానికి సర్వం సిద్థం

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - May 06 , 2025 | 10:03 AM