Karan Johar: బాలీవుడ్‌లో దర్శకుల సంక్షోభం

ABN , Publish Date - Aug 16 , 2025 | 05:48 PM

అవునూ.. బాలీవుడ్ య‌మ‌ క‌ష్టాల్లో ఉంద‌ని తేల్చేశాడు అక్కడి బ‌డా ప్రొడ్యూస‌ర్. త‌మ వాళ్లకు సినిమాలు తీయ‌డం రావ‌డం లేద‌ని ఓపెన్ స్టేట్‌మెంట్ ఇచ్చాడు. కాపీ చేయ‌బోతూ బొక్కాబొర్లాప‌డుతున్నార‌ని కుండ‌బ‌ద్దలు కొట్టాడు. ఇంత‌కి స్ట్రెయిట్ కామెంట్స్ చేసిన ఆ ప్రొడ్యూస‌ర్ ఎవ‌రు.. అస‌లెందుకు ఈ కామెంట్స్ చేశాడు.

బాలీవుడ్ బిగ్ షాట్ ఫిల్మ్‌మేకర్ కరణ్ జోహార్ (Karan Johar ) బీటౌన్ ప‌రిస్థితిపై త‌న మ‌న‌సులోని మాటల‌ను బ‌య‌ట‌కు చెప్పేశాడు. ఇన్నాళ్లు త‌న‌లో న‌లిగిపోతున్న ఫీలింగ్స్ అన్నింటినీ బ‌య‌ట‌కు పంచుకున్నాడు హిందీ సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్ల కొరత ఉందని ఫీలైపోయాడు. బలమైన, జనాల్ని థియేటర్లకు పరుగెత్తించే సినిమాలు తీయడం చాలా మంది డైరెక్టర్లు మర్చిపోయారని అన్నాడు. మాస్, హై-ఎనర్జీ సినిమాలు తీద్దామని ట్రై చేస్తే, బాలీవుడ్ తన స్పెషాలిటీ అయిన జోనర్స్‌ను సైడ్ చేసేస్తోందని చెప్పాడు.


ఒక ఇంటర్వ్యూలో త‌న ఒపినీయ‌న్స్ అన్నింటినీ ఒపెన్‌గా చెప్పేశాడు క‌ర‌ణ్. జనాల్ని సినిమా హాళ్లకు రప్పించే భారీ ఫిల్మ్‌లు తీయగల డైరెక్టర్లు బాలీవుడ్‌లో లేరా అని అడిగితే,.. అవును.. మన ఇండస్ట్రీ డైరెక్టర్ల క్రైసిస్‌లో ఉందని అన్నాడు. నార్త్‌లో ఒక జనరేషన్ మొత్తం షారుఖ్ ఖాన్ (Shah rukh khan) లవ్ స్టోరీస్, విదేశీ లొకేషన్స్‌లో తీసిన రొమాంటిక్ ఫిల్మ్స్, 2000ల్లో గ్లోబల్ వైబ్‌తో పెరిగిందని.. అలాంటిది ఈ జనరేషన్‌కు మాస్, ఎనర్జిటిక్ సినిమాలు తీయడం రావ‌డం లేద‌ని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు నేర్చుకోవడం కష్టమని, కాపీ కొట్టాలని చూస్తే ఫెయిల్ అవుతున్నారని చెప్పాడు.

ఇతర ఇండస్ట్రీస్‌లా గ్రాండ్ సినిమాలు తీయడం మనకు సెట్ కాదేమో అని హిత‌వు ప‌లికాడు. సౌత్ స్టైల్ మాస్ మసాలా, లార్జర్ దేన్ లైఫ్ సినిమాలు కాపీ చేయడం మానేసి, బాలీవుడ్ తన స్ట్రాంగ్ ఏరియాస్‌పై ఫోకస్ చేయాలని సజెస్ట్ చేశాడు. 'సైయారా' (Saiyaara) సినిమా హిట్‌ను పొగుడుతూ, అది బాలీవుడ్ స్పెషాలిటీ ఏంటో చూపించిందని అన్నాడు. 'సైయారా' డైరెక్టర్ మోహిత్ సూరికి సౌత్ డైరెక్టర్ల నుంచి ప్రశంసలు వచ్చాయని, ఇది ఈ మధ్య రేర్ అని చెప్పాడు. మొత్తానికి బీటౌన్ పెద్ద క‌ష్టంలోనే ఉంద‌ని చెప్పడం హాట్ టాపిక్‌గా మారింది.

Read Also: OG Movie: 'ఓజీ'.. ప్రియాంక అరుల్ మోహన్ ఫస్ట్ లుక్  వచ్చేసింది 

Read Also: Rashmika Mandanna: 7 ఏళ్ల గీత గోవిందం.. ఇప్పటికీ నమ్మలేకపోతున్నా

Updated Date - Aug 16 , 2025 | 05:49 PM