Taapsee Pannu: మరోసారి కనికాతో చేతులు కలిపిన తాప్సీ
ABN , Publish Date - May 06 , 2025 | 01:04 PM
తాప్సీ పన్ను నటించిన 'హాసీన్ దిల్ రుబా' ఇప్పటికే రెండు భాగాలుగా వచ్చింది. ఇప్పుడీ సినిమా మూడో భాగానికీ శ్రీకారం చుట్టారు మేకర్స్.
ప్రముఖ బాలీవుడ్ నటి తాప్సీ పన్ను (Taapsee Pannu) కెరీర్ ఎత్తుపల్లాలతో సాగుతోంది. కమర్షియల్ చట్రంలో ఇరుక్కుపోకుండా, డిఫరెంట్ క్యారెక్టర్స్ కు తాప్సీ ప్రాధాన్యం ఇస్తుండటం వల్ల ఆమె ఖాతాలో విజయాలకంటే పరాజయాలే ఎక్కువగా పడుతున్నాయి. అయితే సక్సెస్, ఫెయిల్యూర్ కు పట్టించుకోకుండా తనకు నచ్చిన పాత్ర చేసుకుంటూ తాప్సీ ముందుకు సాగుతోంది. ముక్కుసూటి తనం వల్ల కూడా తాప్సీకి విరోధులు ఎక్కువగానే ఉంటారు. అయినా... మనసులో ఏది ఉంటే పైకి అదే మాట్లాడటం ఆమె అలవాటుగా చేసేసుకుంది.
ఇక కెరీర్ విషయానికి వస్తే... హీరోయిన్ తాప్సీ - రైటర్ కనికా థిల్లాన్ (Kanika Dhillon) మధ్య విడదీయరాని అనుబంధం ఉంది. రచయిత్రిగా బాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న కనికా... ప్రముఖ దర్శకుడు కె. రాఘవేంద్రరావు (K. Raghavendra Rao) కుమారుడు సూర్యప్రకాశ్‌ను పెళ్ళాడి, ఆ తర్వాత విడాకులు తీసుకుంది. నాలుగేళ్ళ క్రితం హిమన్షు శర్మను సెకండ్ మ్యారేజ్ చేసుకుంది. ఇక తాప్సీ విషయానికి వస్తే... కనికా రచనలు చేసిన సినిమాల్లో నటించడానికి తాప్సీ ప్రాధాన్యం ఇస్తుంది. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో 'మన్మార్జియాన్' (Manmarziyaan), 'హసీన్ దిల్ రుబా', 'రష్మీ రాకెట్', 'డంకీ' చిత్రాలు వచ్చాయి. అలానే 'హీసన్ దిల్ రుబా'కు సీక్వెల్ కూ కనికా వర్క్ చేసింది. ఇందులో మొదటి చక్కని ఆదరణ పొందినా... 'ఫిల్ హసీన్ దిల్ రుబా' పరాజయం పాలైంది. మొదటి సినిమాలో ఉన్న సస్పెన్స్ అండ్ థ్రిల్లింగ్ అంశాలు రెండో దానిలో కొరవడ్డాయని, నటీనటులు కూడా తమ నటనతో ఏమంత మెప్పించలేదని విమర్శలు వచ్చాయి. చిత్రం ఏమంటే... ఈ రెండో భాగం పరాజయం పాలైనా... ఇప్పుడు 'హసీన్ దిల్ రుబా' థర్డ్ పార్ట్ కోసం తాప్సీ, కనీక మరోసారి జోడీ కడుతున్నారు. ఇప్పటికే సీక్వెల్ వర్క్ ప్రీ ప్రొడక్షన్ స్టార్ అయ్యిందని తాప్సీ తెలిపింది. మొదటి రెండు పార్ట్స్ కంటే ఇది మరింత ఇంపాక్ట్ తో ఉంటుందని చెబుతోంది. ఓటమి నుండి పాఠాలు నేర్చుకుని... మరి ఈ థర్డ్ పార్ట్ ను సక్సెస్ ట్రాక్ లోకి తీసుకొస్తారేమో చూడాలి.
Also Read: Varun - Lavanya: జీవితంలో అత్యంత అందమైన పాత్ర.. కమింగ్ సూన్
Also Read: Kiara Adwani: కియారా లుక్‌కి హీరోయిన్లే ఫిదా అయ్యారు...
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి