Kiara Adwani: కియారా లుక్‌కి హీరోయిన్లే ఫిదా అయ్యారు..
ABN , Publish Date - May 06 , 2025 | 12:49 PM
ప్రతిష్ఠాత్మక 'మెట్ గాలా' ఫ్యాషన్ (Met Gala 2025) ఈవెంట్ 2025 అట్టహాసంగా మొదలైంది. న్యూయార్క్‌లోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్స్ దీనికి వేదికగా అయింది..
ప్రతిష్ఠాత్మక 'మెట్ గాలా' ఫ్యాషన్ (Met Gala 2025) ఈవెంట్ 2025 అట్టహాసంగా మొదలైంది. న్యూయార్క్‌లోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్స్ దీనికి వేదికగా అయింది.. అంతర్జాతీయంగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొన్నారు. సినీతారలు రెడ్ కార్పెట్‌పై హోయలొలికించారు. భిన్నమైన దుస్తులు ధరించి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. పలువురు భారతీయ తారలు కూడా ఈ వేడుకలో సందడి చేశారు. కియారా అద్వానీ (kiara adwani) ర్యాంప్‌పై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన ఫొటోలు వైరల్‌గా మారాయి.
ఇటీవల ఆమె రామ్ చరణ్‌కు జోడీగా గేమ్ ఛేంజర్ చిత్రంలో కనిపించారు. ఈ మీడియాకు దూరంగా ఉన్న కియారా (Kiara with Baby Bump) తాజాగా మెట్ గాలా ఈవెంట్‌లో మెరిశారు. ప్రముఖ భారతీయ డిజైనర్ గౌరవ్ గుప్తా ప్రత్యేకంగా రూపొందించిన గౌనులో ఆమె మెట్ గాలా వేడుకలో రెడ్ కార్పెట్ పై నడిచారు. ఈ సందర్భంగా కియారా బేబీ బంప్‌తో కనిపించడం అందరి దృష్టిని ఆకర్షించింది. మొదటి సారి బేబీ బేబీ బంప్‌తో బయటకు రావడం, ఆమె ధరించిన స్టైలిష్ అవుట్‌ఫిట్ ఆకర్షణీయంగా ఉండడంతో ఈ ఈవెంట్‌లో ఆహుతులు కళ్లు తిప్పుకోలేకపోయారు. ఇదే విషయాన్ని కరణ్ జోహార్, రకుల్ ప్రీత్‌సింగ్, అలియాభట్ ఇన్‌స్టా వేదికగా పోస్ట్ చేశారు. ఆమె బేబీ బంప్ ఫొటోలతోపాటు తారల కామెంట్స్ కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్ హీరో సిద్థార్థ్ మల్హోత్రను కియారా ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.