Ramayan: రామాయణ స్క్రిప్ట్, పాత్రల్లో మార్పు.. డైరెక్టర్ కౌంటర్
ABN, Publish Date - Oct 03 , 2025 | 06:09 PM
‘రామాయణం’ మరోసారి ప్రేక్షకుల్ని అలరించడానికి సిద్ధమవుతుంది. బాలీవుడ్ డైరెక్టర్ నితీశ్ తివారీ ‘రామాయణ’ పేరుతో భారీగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
‘రామాయణం’(Ramayana) మరోసారి ప్రేక్షకుల్ని అలరించడానికి సిద్ధమవుతుంది. బాలీవుడ్ డైరెక్టర్ నితీశ్ తివారీ (nitesh Tiwari) ‘రామాయణ’ పేరుతో భారీగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాలో కొన్ని పాత్రలకు సంబంధించి స్ర్కిప్ట్‌లో మార్పులు చేస్తున్నారని ఓ బాలీవుడ్ మీడియా కథనం రాసుకొచ్చింది. అధిక బాగం వాల్మీకి రామాయణం నుంచి తీసుకున్నారని.. శూర్పణఖ ఇతర పాత్రలను వేరే రామాయణ కథల నుంచి తీసుకోనున్నట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో దర్శకుడు నితీశ్ తివారీ సెటైరికల్‌గా మాట్లాడారు. ‘రామాయణ మహాకావ్యాన్ని ఇప్పటి వరకూ ఎంతోమంది రచించారు. ఎంతోమంది దర్శకులు సినిమాలుగా తీశారు. ఆ గ్రంథాలు చదివి వాటి ఆధారంగా ఈ సినిమా తీస్తున్నాను’ అని ఆయన తెలిపారు.
ఇంకా చెబుతూ ‘నాకు రామాయణంలోని ప్రతి పాత్రా ఇష్టమే. ఏ రకంగా చూసినా ఈ కావ్యం కొత్తగానే కనిపిస్తుంది. దానిపైన కోర్సులు కూడా చేశాను. నాకెంతో స్ఫూర్తినిచ్చిన కావ్యం రామాయణం. ఈ సినిమా కోసం ఇప్పటి వరకూ ఎంతో మంది రాసిన వాటిని పరిశీలించి, వాటిని పరిగణనలోకి తీసుకొని నిజమైన దాన్ని సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం. ఎంతోమంది నిపుణులు కూడా ఈ స్క్రిప్ట్ లో భాగమాయ్యరు. వారి సూచనలను కూడా పరిగణనలోకి తీసుకున్నాం’ అన్నారు. రెండు పార్టులుగా ఈ చిత్రం రాబోతోంది. ఇప్పటికే మొదటి పార్ట్ షూటింగ్ పూర్తయిందని మేకర్స్ ప్రకటించారు. ప్రస్తుం దీనికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని తెలిసింది. రూ.4000 కోట్ల భారీ బడ్జెట్‌తో రానున్న ఈ సినిమాలో రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణుడిగా యశ్, హనుమంతుడిగా సన్నీదేవోల్ నటిస్తున్నారు. కైకేయిగా లారాదత్తా, శూర్పణఖగా రకుల్‌ప్రీత్‌సింగ్ కనిపించనున్నట్లు వార్తలు హల్‌చల్ చేస్తున్నారు. మొదటి పార్ట్ 2026 దీపావళికి, రెండో పార్ట్ 2027 దీపావళికి విడుదల కానున్నాయని నిర్మాత నమిత్ మల్హోత్ర తెలిపారు. హాన్స్ జిమ్మర్, ఎ.ఆర్.రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.