Vijay- Rashmika: విజయ్ - రష్మిక పెళ్లి డేట్ ఫిక్స్..

ABN , Publish Date - Dec 29 , 2025 | 09:19 PM

ఎట్టకేలకు మరో ప్రేమ జంట పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ఇండస్ట్రీలో హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ కామన్ .. కానీ, దాన్ని నిలబెట్టుకొనేవారు చాలా తక్కువమంది.

Vijay- Rashmika

Vijay- Rashmika: ఎట్టకేలకు మరో ప్రేమ జంట పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ఇండస్ట్రీలో హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ కామన్ .. కానీ, దాన్ని నిలబెట్టుకొనేవారు చాలా తక్కువమంది. ఈ ఏడాది చాలామంది సెలబ్రిటీలు తాము ప్రేమించినవారికి వివాహాం చేసుకొని ఒక ఇంటివారు అయ్యారు. వచ్చే ఏడాది ఇండస్ట్రీ మొత్తం ఎదురుచూస్తున్న జంటఒక్కటి కానున్నారు. వారే విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) - రష్మిక మందన్నా (Rashmika Mandanna). ఎప్పటి నుంచో వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారని వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ, ఈ జంట మాత్రం ఎప్పుడు ఈ విషయాన్నీ బయటపెట్టలేదు.

ఇక ఈ అక్టోబర్ లో విజయ్ - రష్మిక చాలా సింపుల్ గా ఎంగేజ్ మెంట్ చేసుకున్నారు. విజయ్ ఇంట్లోనే కేవలం అతికొద్దిమంది బంధుమిత్రుల మధ్య వీరి నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఎంగేజ్ మెంట్ తరువాత కూడా విజయ్, రష్మిక దాని గురించి బయటపెట్టలేదు. అయితే వీరిద్దరూ తమ పర్సనల్ విషయాలను మీడియాకు దూరం పెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అందుకే ఏ విషయాన్నీ అధికారికంగా చెప్పడం లేదని సమాచారం.

తాజాగా విజయ్- రష్మిక పెళ్లి డేట్ ఇదేనంటూ సోషల్ మీడియాలో ఒక డేట్ వైరల్ గా మారింది. ఫిబ్రవరి 26 న వీరిద్దరి పెళ్లి ఉదయపూర్ లో ఘనంగా జరగనుందని తెలుస్తోంది. ఈ మధ్యనే ఈ పెళ్లి డేట్ ను ఇరు కుటుంబ సభ్యులు కలిసి ఫైనల్ చేశారని, డెస్టినేషన్ వెడ్డింగ్ గా వీరిద్దరి పెళ్లి ఉదయపూర్ లో గ్రాండ్ గా జరగనుందని వార్తలు వినిపిస్తున్నాయి. అక్కడకు కూడా ఇండస్ట్రీ నుంచి చాలా తక్కువమంది మాత్రమే పిలవనున్నారని, హైదరాబాద్ వచ్చాకా గ్రాండ్ గా రిసెప్షన్ నిర్వహించనున్నారని.. ఈ వేడుకకు ఇండస్ట్రీ మొత్తం హాజరుకానుందని సమాచారం. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.

Updated Date - Dec 29 , 2025 | 09:19 PM