Funkey Teaser: ఫంకీ టీజర్.. ఈసారి జాతిరత్నాలును మించి
ABN , Publish Date - Oct 10 , 2025 | 05:39 PM
జాతిరత్నాలు సినిమాతో ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు అనుదీప్ కెవి (Amudeep KV).
Funkey Teaser: జాతిరత్నాలు సినిమాతో ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు అనుదీప్ కెవి (Amudeep KV). ఆ సినిమాలో కామెడీ గురించి ఇప్పటికీ ఎక్కడో ఒకచోట చర్చ జరుగుతూనే ఉంటుంది. ఇక ఈ సినిమా తరువాత అనుదీప్.. ప్రిన్స్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ నటించిన ఈ చిత్రం కామెడీ పరంగా వర్క్ అవుట్ అయ్యింది కానీ విజయాన్నిమాత్రం అందుకోలేకపోయింది. ఆ తరువాత నుంచి అనుదీప్ ఒక్క సినిమాను కూడా ప్రకటించలేదు.
సినిమాలు చేయకపోయినా ఆయన కామెడీ టైమింగ్ ను టాలీవుడ్ బాగానే వాడుకుంది. స్టార్ హీరోల సినిమాల్లో అలా అలా కనిపించి షాక్ ఇచ్చాడు. ఇక చాలా గ్యాప్ తరువాత అనుదీప్ కెవి దర్శకత్వంలో వస్తున్న చిత్రం ఫంకీ. విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై నాగవంశీ నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రంతో సోషల్ మీడియా సెన్సేషన్ కాయదు లోహర్ తెలుగుతెరకు పరిచయం కాబోతుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
తాజాగా ఫంకీ టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. టీజర్ ఆద్యంతం నవ్వులు పూయిస్తుంది. జాతిరత్నాలు అనుదీప్ మళ్లీ తిరిగి వచ్చినట్లు కనిపిస్తుంది. ప్రతి డైలాగ్ లోనూ అనుదీప్ రైటింగ్ కనిపిస్తుంది. ఇక సినిమాలో సినిమా కథగా తెలుస్తోంది. విశ్వక్ డైరెక్టర్ గా కనిపిస్తుండగా.. కాయదు నిర్మాతగా కనిపిస్తుంది. వీరిద్దరి మధ్య జరిగే ప్రేమ కథనే ఫంకీ అని తెలుస్తోంది. కామెడీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉండబోతుందని తెలుస్తోంది. జాతరత్నాలు సినిమాలో కామెడీ ఎలా ఉందో దానికి మించి ఫంకీలో చూపించబోతున్నారని తెలుస్తోంది.
విశ్వక్ క్లాస్ లుక్.. కాయదు అందం సినిమాకు ప్లస్ కానున్నాయి. ఇక భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ హైలైట్ గా నిలుస్తుందని చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ టీజర్ నెట్టింట వైరల్ గా మారింది. త్వరలోనే ఫంకీ రిలీజ్ కు సిద్దమవుతుంది. మరి ఈ సినిమాతో విశ్వక్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.
Kiran Abbavaram: కిస్సింగ్ సీన్స్ కు కొదవలేని కె-ర్యాంప్
They Call Him OG: సువ్వి సువ్వి సువ్వాలా.. వీడియో సాంగ్ వచ్చేసింది