సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Shilpa Shetty: స్టార్ హీరోయిన్ రెస్టారెంట్.. నెలకు రూ. 6 కోట్ల ఆదాయం 

ABN, Publish Date - Jun 18 , 2025 | 08:04 PM

బాలీవుడ్ బ్యూటీ శిల్పా శెట్టి (Shilpa Shetty) కూడా ప్రస్తుతం బిజినెస్ విమెన్ గా నెలకు కోట్లు గడిస్తుంది.

Shilpa Shetty

Shilpa Shetty:  దీపం ఉండగానే ఇల్లు చెక్కబెట్టుకోవాలి అని అంటారు పెద్దలు. ఒక రూపాయి సంపాదించేటప్పుడే వ్యాపారాలు మొదలుపెట్టాలి అని అంటున్నారు బాలీవుడ్ హీరోయిన్స్.  హీరోయిన్ గా కెరీర్ ను మొదలుపెట్టి  ఒక్క హిట్.. కొద్దిగా పేరు రావడంతోనే  ఇప్పటి హీరోయిన్స్ వ్యాపారాల్లోకి దిగుతున్నారు. తెలుగు హీరోయిన్స్ తో పోలిస్తే బాలీవుడ్ హీరోయిన్స్ ఒకపక్క సినిమాలతో ఇంకోపక్క వ్యాపారాలతో రెండు చేతులా సంపాదిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ శిల్పా శెట్టి (Shilpa Shetty) కూడా ప్రస్తుతం బిజినెస్ విమెన్ గా నెలకు కోట్లు గడిస్తుంది.


జీరో సైజ్ కు బ్రాండ్ అంబాసిడర్ అయినా శిల్పా శెట్టి తెలుగులో సాహసవీరుడు సాగర కన్య సినిమాలో నటించింది. జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాను దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాను తెరకెక్కించారు. కానీ, ఆ సినిమా అంత విజయం ఈ సినిమా దక్కించుకోలేకపోయింది. ఇక  ఈ సినిమా తరువాత శిల్పా శెట్టి తెలుగు వైపు అడుగు పెట్టలేదు. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలోనే అమ్మడు పలు వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టింది. ఇక శిల్పా శెట్టికి ముంబైలోని బాంద్రాలో  బాస్టియ‌న్ పేరుతో ఒక రెస్టారెంట్  ఉంది. 


2019 లో రంజిత్ బింద్రాతో ఆమె ఈ రెస్టారెంట్ బిజినెస్ మొదలుపెట్టింది.  మొదట బాంద్రాలో మొదలైన ఈ రెస్టారెంట్  అంచెలంచలుగా ఎదిగి  నెమ్మ‌దిగా న‌గ‌రంలోని పలు ప్రాంతాల‌కు విస్త‌రించింది. ఇక అందుతున్న సమాచారం ప్రకారం ఈ రెస్టారెంట్ నుంచి శిల్పా శెట్టికి నెలకు రూ. 6 కోట్లు ఆదాయం వస్తుంది. రూ. 6 కోట్లు అంటే అంత చిన్న విషయం కాదు. అంతేకాకుండా ముంబైలోని రెస్టారెంట్స్ అన్నింటిలో అత్యధిక జీఎస్టీ కట్టే ఏకైక రెస్టారెంట్ శిల్పా శెట్టిదే. ఈ విషయాన్నీ ఆమె స్వయంగా చెప్పుకొచ్చింది.


ఇక తన బాస్టియన్ రెస్టారెంట్ కేవలం ముంబైలోనే కాకుండా పూణే, కలకత్తా, బెంగుళూరులో కూడా విస్తరింపజేయాలని చూస్తున్నట్లు శిల్పా చెప్పుకొచ్చింది. గోవాలో  రెండు బ్రాంచ్ లు రిలీజ్ చేసే ప్రయత్నాల్లో ఉన్నట్లు కూడా తెలిపింది. ముంబై లోని స్టార్ సెలబ్రిటీలు అందరూ ఎక్కువగా బాస్టియన్ రెస్టారెంట్స్ లోనే దర్శనమిస్తూ ఉంటారు. దీనివలన పేరుకు పేరు.. డబ్బుకు డబ్బు వస్తుంది. ఇక బాస్టియన్ రెస్టారెంట్ యాంబియన్స్ కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఇక శిల్పా శెట్టికి ఇప్పటివరకు 6 రెస్టారెంట్స్ ఉన్నాయి. ఇక రెస్టారెంట్ బిజినెస్ కాకుండా శిల్పాకు యోగా స్టూడియోస్ కూడా ఉన్నాయి. అలా శిల్పా హీరోయిన్ గా ఎదుగుతున్న సమయంలోనే వ్యాపారంలో పెట్టుబడులు పెట్టి ఇప్పుడు కోట్లు గడిస్తుంది. 

Kajol: రామోజీ ఫిల్మ్ సిటీ.. ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన చోటు

Updated Date - Jun 18 , 2025 | 08:06 PM