Kajol: రామోజీ ఫిల్మ్ సిటీ.. ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన చోటు
ABN , Publish Date - Jun 18 , 2025 | 06:57 PM
బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కాజోల్ (Kajol) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Kajol: బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కాజోల్ (Kajol) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు ఆమె తెలుగులో సినిమాలు చేయకపోయినా దిల్ వాలే దుల్హనియా లేజాయింగే(Dilwale Dulhania Lejayenge) సినిమా దగ్గర నుంచి ఇప్పటివరకు ఆమె నటించిన సినిమాలకు తెలుగులో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించిన కాజోల్.. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే అజయ్ దేవగణ్ ను ప్రేమించి పెళ్లాడింది. పెళ్లి తరువాత సినిమాలకు గ్యాప్ ఇచ్చిన ఆమె.. ఇప్పుడిప్పుడే రీఎంట్రీ ఇచ్చి బిజీగా మారింది.
ఇక సినిమాలు చేయకపోయినా సోషల్ మీడియాలో నిత్యం అభిమానులకు దగ్గరగానే ఉంటుంది. ఇక ప్రస్తుతం ఆమె నటించిన చిత్రం 'మా'. విశాల్ ఫురియా దర్శకత్వం వహించిన ఈ సినిమా జూన్ 20 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన కాజోల్ వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాపై హైప్ క్రియేట్ చేస్తుంది. ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో కాజోల్.. ప్రపంచంలోనే అత్యంత విస్తీర్ణం కలిగిన ఫిల్మ్ స్టూడియోగా గిన్నిస్ బుక్ అవార్డును అందుకున్న రామోజీ ఫిల్మ్ స్టూడియోపై సంచలన వ్యాఖ్యలు చేసింది.
హైదరాబాద్ లో ఉన్న ఈ ఫిల్మ్ స్టూడియోలో తనకు నెగిటివ్ వైబ్స్ వచ్చాయని, అక్కడ దెయ్యాలు ఉన్నాయన్నట్లు చెప్పుకొచ్చింది. ' షూటింగ్ చేస్తున్న సమయంలో నెగిటివ్ వైబ్స్ వస్తాయి. కొన్ని ప్రదేశాలు చాలా భయపెడతాయి. వెంటనే ఆ ప్రదేశం నుంచి బయటకు వచ్చేసి ఆ తరువాత ఎప్పుడు అక్కడకు వెళ్లాలనిపించదు. అందులో ఒకటి హైదరాబాద్ లో ఉన్న రామోజీ ఫిల్మ్ స్టూడియో. ప్రపంచంలోనే ఎక్కువ భయపెట్టే హాంటెడ్ ప్లేస్ లలో రామోజీ ఫిల్మ్ సిటీ ఒకటి ' అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం కాజోల్ వ్యాఖ్యలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
ఇక కాజోల్ వ్యాఖ్యలపై నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. అసలు ఏం మాట్లాడుతున్నావ్ అక్కా.. రామోజీ ఫిల్మ్ సిటీ భయపెట్టడం ఏంటి.. ? మతిపోయిందా అని కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు అవును.. అవును.. అక్కడే బాహుబలి, ఆర్ఆర్ఆర్ తీశారు కదా.. అందుకే ఆ భయం అని సెటైర్లు వేస్తున్నారు. ప్రస్తుతం కాజోల్ వ్యాఖ్యలు టాలీవుడ్ లో దుమారం రేపుతున్నాయి.
Lenin Movie: పరువు హత్యల నేపథ్యంలో.. అక్కినేని హీరో.. ?