Govinda: నేను క్షేమంగా ఉన్నా.. మీడియాతో మాట్లాడిన గోవిందా
ABN, Publish Date - Nov 12 , 2025 | 03:24 PM
బాలీవుడ్ నటుడు గోవిందా (Govinda) కొద్దిసేపటి క్రితమే హాస్పిటల్ నుంచి డిశ్చార్చ్ అయ్యారు. బయటకు రాగానే ఆయన మీడియాతో మాట్లాడారు.
Govinda: బాలీవుడ్ నటుడు గోవిందా (Govinda) కొద్దిసేపటి క్రితమే హాస్పిటల్ నుంచి డిశ్చార్చ్ అయ్యారు. బయటకు రాగానే ఆయన మీడియాతో మాట్లాడారు. తాను క్షేమంగానే ఉన్నాను అని, తన ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. ఎక్కువగా వర్కవుట్స్ చేయడం వలన అలిసిపోయానని, అందుకే కళ్ళు తిరిగి పడినట్లు చెప్పుకొచ్చారు. ఇక వర్కవుట్స్ కన్నా యోగా, ప్రాణాయామం చేస్తే ఆరోగ్యానికి మంచిదని తెలిపారు.
గత రాత్రి గోవిందా సడెన్ గా కళ్ళు తిరిగి పడిపోవడంతో వెంటనే ఆయనను జూహూలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించారు. రాత్రి నుంచి వైద్యులు ఏ విషయం చెప్పకపోవడంతో అభిమానులు చాలా ఆందోళనకు గురయ్యారు. ఇక ఇప్పుడు గోవిందా క్షేమంగా ఇంటికి చేరుకోవడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఆయన పూర్తిగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
ఒక నెల రోజుల నుంచి గోవిందా వరుస సినిమాలతో బిజీగా ఉన్నారని, రెస్ట్ లేకుండా ఒకపక్క షూటింగ్స్ ఇంకోపక్క వర్కవుట్స్ చేయడం వలన విశ్రాంతి లేక ఇలా స్పృహ తప్పి పడిపోయి ఉండొచ్చు. ప్రస్తుతం ఆయనను రెస్ట్ తీసుకోమని వైద్యులు సూచించారు అని గోవిందా స్నేహితుడు, లాయర్ బిందాల్ చెప్పుకొచ్చాడు.
Govinda: బాలీవుడ్ హీరోకు తీవ్ర అనారోగ్యం.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు