Govinda: బాలీవుడ్ హీరోకు తీవ్ర అనారోగ్యం.. హుటాహుటిన ఆస్ప‌త్రికి త‌ర‌లింపు

ABN , Publish Date - Nov 12 , 2025 | 09:31 AM

బాలీవుడ్‌ నటుడు గోవిందా మంగళవారం రాత్రి అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. జూహూ క్రిటికేర్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు.

Govinda

బాలీవుడ్ (Bollywood) హీరో గోవింద (Govinda) తీవ్ర అనారోగ్యం పాల‌య్యారు. మంగళవారం రాత్రి అకస్మాత్తుగా అస్వస్థతకు గురైన గోవింద‌ను వెంటనే జూహూ లోని క్రిటికేర్‌ హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆసుపత్రి వర్గాల సమాచారం ప్రకారం, ఆయన పరిస్థితి స్థిరంగా ఉన్నప్పటికీ, పూర్తిగా కోలుకునే వరకు వైద్య పర్యవేక్షణలోనే ఉంచనున్నారు.

ఈ ఘటన ఆయన కుటుంబ సభ్యులు మరియు అభిమానులను ఆందోళనకు గురిచేసింది. నటుడు చాలా కాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని, గత కొద్ది రోజులుగా విశ్రాంతి తీసుకుంటున్నారని సమాచారం. వైద్యుల సూచనల మేరకు ప్రస్తుతం అవసరమైన పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే గ‌త నెల‌లో గోవింద త‌న రివాల్వ‌ర్‌ను బీరువాలో పెడుతుండ‌గా అనుకోకుండా మిస్ ఫైర్ అయి అత‌ని కాలుకు తీవ్ర‌ గాయం అయింది. ఆ త‌ర్వాత చికిత్స అనంత‌రం ఇంటి వ‌ద్దే విశ్రాంతి తీసుకుంటున్నారు.

ఇదిలాఉంటే.. బాలీవుడ్‌ను వ‌రుస‌గా విషాదాలు వెంటాడుతున్నాయి. గ‌డిచిన‌ నెల , రెండు నెల‌లుగా చాలామంది సెల‌బ్రిటీలు క‌న్నుమూస్తు వ‌స్తున్నారు. ఈ క్ర‌మంలో స‌డ‌న్‌గా నాటి స్టార్ హీరో ద‌ర్మేంద్ర చ‌నిపోయాడంటూ వార్త‌లు రావ‌డంతో బాలీవుడ్‌కు షాక్ గుర‌యింది. అయితే అదంతా ఫేక్ న్యూస్ అని అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ ప‌డుతున్నాడ‌ని, ప్ర‌స్తుతం ఆయ‌న హెల్త్‌ నిల‌క‌డ‌గా ఉంవ‌ద‌ని ఆప్స‌త్రి నుంచి డిశ్చిర్జి అయి ఇంట్లోనే వైద్యుల ప‌ర్వ‌వేక్ష‌ణ‌లో ఉన్న‌ట్లు కుటుంబ స‌భ్య‌లు స్ప‌ష్టం చేశారు.

మ‌రోవైపు అల‌నాటి చిత్రాల‌లో విల‌న్ క్యారెక‌ట‌ర్ల‌కు కేరాఫ్ అయిన ప్రేమ్ చోప్రా సైతం తీవ్ర అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో మంగ‌ళ‌వారం రాత్రి ముంబై లీలావ‌తి ఆస్ప‌త్రిలో చేరారు. ఇవ‌న్నీ ఇలా ఉండ‌గానే ఇప్పుడు గోవింద సైతం ఆస్ప‌త్రి పాలు కావ‌డం ముంబై సినీ వ‌ర్గాల‌ను క‌ల‌వ‌ర పెడుతున్నాయి.

Updated Date - Nov 12 , 2025 | 09:31 AM