సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

AR Rahman-Hans Zimmer: నేనే కాదు.. ఎవరూ ఊహించి ఉండరు

ABN, Publish Date - Jul 19 , 2025 | 09:47 AM

ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఎక్కడ చూసినా, విన్నా బాలీవుడ్‌లో భారీ స్థాయిలో నితేశ్‌ తివారీ దర్శకత్వం వహిస్తున్న  ‘రామాయణ’ (Ramayana) చిత్రం చర్చ నడుస్తోంది.

ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఎక్కడ చూసినా, విన్నా బాలీవుడ్‌లో భారీ స్థాయిలో నితేశ్‌ తివారీ దర్శకత్వం వహిస్తున్న  ‘రామాయణ’ (Ramayana) చిత్రం చర్చ నడుస్తోంది. ప్రపంచం మొత్తం భారత సినిమా వైపు చూసేలా ఈ చిత్రం ఉండబోతుందని నిర్మాత నమిత్‌ మల్హోత్ర (Namith Malhotra) ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. బడ్జెట్‌పై రకరకాలుగా వస్తున్న ఊహాగానాలకు ఆయన చెక్‌ పెట్టారు. రెండు పార్టులుగా రూపొందుతున్న ఈ చితాన్ని రూ.4000 కోట్లతో తెరకెక్కిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ సినిమా ఫస్ట్‌ గ్లింప్స్‌ విడుదల చేసిన రోజు నుంచి సినిమాకు సంబంధించి రోజుకో ఆసక్తికర వార్త బయటకు వన్తుంది. తాజాగా ఇప్పుడు మరో వార్త నెట్టింట వైరల్‌ అవుతోంది. ఈ సినిమాకు హాలీవుడ్‌ మ్యూజిక్‌ దర్శకుడు హన్స్‌ జిమ్మర్‌తో (Hans Zimmer) కలిసి ఆస్కార్‌ విన్నర్‌ ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం అందించనున్నారు. తాజాగా ఈ సినిమా మ్యూజిక్‌పై ఏఆర్‌ రెహమాన్‌ (AR rahman) ఇంగ్లిష్‌ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘ఇంత పెద్ద ప్రాజెక్ట్‌కు హాలీవుడ్‌లో గొప్ప సంగీత దర్శకుడైన ఇలాంటి సంగీత దర్శకుడితో కలిసి పనిచేస్తానని నేనే కాదు.. ఎవరూ ఊహించి ఉండరు’ అని రెహమాన్‌ చెప్పారు.  


‘రామాయణ’ మన భారతీయ సంస్కృతి. ఇలాంటి ప్రాజెక్ట్‌లో అవకాశం రావడం గర్వంగా ఉంది. అంతా అనుకున్నట్లుగా జరిగి మీ ముందుకు దీన్ని అద్భుత చిత్రంగా తీసుకు రావాలని కోరుకుంటున్నాను. నేను, హన్స్‌ జిమ్మర్‌ దీనికోసం ఎన్నో సెషన్‌లు వర్క్‌ చేశాం. మొదటిది లండన్‌లో, రెండోది లాస్‌ ఏంజెలెస్‌లో, మూడో సెషన్‌ దుబాయ్‌లో చేశాం. హన్స్‌ అన్ని విషయాల్లో నాలానే ఆలోచిస్తారు. మన సంస్కృతిపై ఎంతో గౌరవం ఉంది. తనకు ఏమైనా అర్థం కాకపోతే ‘దీన్ని వెస్ట్రన్‌ స్టైల్‌లో కంపోజ్‌ చేయవచ్చా’ అని అడుగుతారు. రామాయణ సినిమా అందరూ ఆశ్చర్యపోయే విధంగా రానుంది. కచ్చితంగా చరిత్ర సృష్టిస్తుంది’ అని అన్నారు.


హన్స్‌ జిమ్మర్‌ హాలీవుడ్‌ లో సకుంగ్‌ఫూ పాండస సిరీస్‌, సద లైన్‌ కింగ్‌’, ‘ముఫాసా’, ‘పైరేట్స్‌ ఆఫ్‌ కరేబియన్‌’, ‘ఇంటర్‌స్టెల్లర్‌’,  ‘డ్యూన్‌’, ‘టాప్‌ గన్‌: మార్వెరిక్‌’, ‘ది డార్క్‌ నైట్‌ రైస్‌’ చిత్రాలతోపాటు ఎన్నో చిత్రాలకు సంగీతం అందించారు. రెండుసార్లు ప్రతిష్ఠాత్మక అకాడమీ అవార్డులు అందుకున్నారు. ఐదుసార్లు గ్రామీ అవార్డులు సొంతం చేసుకున్నారు. మన దేశం నుంచి ఆస్కార్‌ అవార్డు అందుకున్న ఎ.ఆర్‌.రెహమాన్‌ ఆయనతో కలిసి ‘రామాయణ’కు వర్క్‌ చేస్తున్నారు. ఇందులో రాముడిగా రణ్‌బీర్‌ కపూర్‌, సీతగా సాయిపల్లవి, రావణుడిగా యశ్‌, హనుమంతుడిగా సన్నీదేవోల్‌ నటిస్తున్నారు. ఈ సినిమా మొదటి పార్టును 2026 దీపావళి, రెండవ భాగాన్ని 2027లో విడుదల చేయనున్నారు. 

Updated Date - Jul 19 , 2025 | 09:48 AM