Anurag Kashyap: చెత్త కంటెంట్ చూపించి నెట్ ఫ్లిక్స్ డబ్బులు గుంజుతుంది
ABN, Publish Date - Jul 12 , 2025 | 06:52 PM
బాలీవుడ్ వివాదాస్పద అనురాగ్ కశ్యప్ (Anurag Kashyap) గురించి తెలుగు ప్రేక్షకులకు కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వివాదం లేకపోయినా.. ఆయన ఏరికోరి వివాదాలను సృష్టిస్తూ ఉంటాడు. డైరెక్టర్ గానే కాకుండా నటుడిగా కూడా పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా మారాడు.
Anurag Kashyap: బాలీవుడ్ వివాదాస్పద అనురాగ్ కశ్యప్ (Anurag Kashyap) గురించి తెలుగు ప్రేక్షకులకు కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వివాదం లేకపోయినా.. ఆయన ఏరికోరి వివాదాలను సృష్టిస్తూ ఉంటాడు. డైరెక్టర్ గానే కాకుండా నటుడిగా కూడా పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా మారాడు. ప్రస్తుతం అనురాగ్ కశ్యప్ తెలుగులో డెకాయిట్ సినిమాలో నటిస్తున్నాడు. ఇక తాజాగా ఈ వివాదస్పద డైరెక్టర్ నెట్ ఫ్లిక్స్ సీఈఓపై మండిపడ్డాడు. కంటెంట్ పై శ్రద్ద చూపించకుండా కేవలం సబ్ స్క్రిప్షన్ పైనే ఫోకస్ చేస్తున్నారని ఫైర్ అయ్యాడు. అంతేకాకుండా చెత్త కంటెంట్ చూపించి డబ్బు గుంజుతున్నాడని చెప్పుకొచ్చాడు.
తాజాగా ఒక ఈవెంట్ లో అనురాగ్ మాట్లాడుతూ.. 'ఇండియా స్టోరీస్ గురించి కానీ, భారతీయ దర్శకుల క్రియేటివిటీ గురించి కానీ, నెట్ ఫ్లిక్స్ సీఈఓకి ఈ మాత్రం అవగాహన లేదు. అతనికి ఇండియాను అర్ధం చేసుకొనే సామర్థ్యం లేదు. నెట్ ఫ్లిక్స్ భారతీయ కార్యాలయం ఏది చెప్తే దాన్నే అతను నమ్ముతాడు. వారికి ఇక్కడి కథలు ఎలాంటివి అనేది తెలియదు కాబట్టి. మన టీవీలో వచ్చే చెత్త కంటెంట్ నే ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తున్నారు. అదే గొప్ప కంటెంట్ అని అనుకుంటున్నారు. దాన్ని చూపిస్తూనే డబ్బును గుంజుతున్నారు. వారికి సబ్ స్క్రిప్షన్స్ మీద ఉన్నంత శ్రద్ద కంటెంట్ మీద లేదు.
స్క్విడ్ గేమ్, అడాల్ సెన్స్, బ్లాక్ వారెంట్ లాంటి సినిమాలు నెట్ ఫ్లిక్స్ ఒరిజినల్స్ కాదు. అవి కేవలం వారు కొనుగోలు చేశారు అంతే. నెట్ ఫ్లిక్స్ ఒరిజినల్స్ గా వచ్చిన సిరీస్ లను వారు ఆదరించలేదు. ఓటీటీలు వచ్చిన కొత్తలో కంటెంట్ ఎప్పుడు కొత్తగా ఉండేది. అందుకే ప్రేక్షకులు ఆదరించారు. కానీ, ఇప్పుడు పరిస్థితి అలా లేదు. అంతా చెత్తలా తయారయ్యింది' అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక నెటిజన్స్ చాలామంది ఈ విషయంలో అనురాగ్ కు సపోర్ట్ గా నిలుస్తున్నారు.
Mayasabha Teaser: యుద్ధం నీ ధర్మం.. ఆసక్తిరేపుతున్న మయసభ ట్రైలర్