Anurag Kashyap: అక్కడ ఏం మాట్లాడినా అర్థం మారిపోతుంది.. ఇక్కడ ప్రశాంతం..
ABN, Publish Date - Sep 18 , 2025 | 05:47 PM
అనురాగ్ కశ్యప్ (Anurag Kashyap) గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. బాలీవుడ్‌లో పలు విజయవంత చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆయన రచయితగా, దర్శకుడిగానే కాకుండా నటుడిగానూ మెప్పించారు.
అనురాగ్ కశ్యప్ (Anurag Kashyap) గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. బాలీవుడ్‌లో పలు విజయవంత చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆయన రచయితగా, దర్శకుడిగానే కాకుండా నటుడిగానూ మెప్పించారు. హిందీలోనే కాక తమిళంలో 'మహారాజా', 'లియో' చిత్రాలు, మలయాళంలో 'రైఫిల్ క్లబ్' చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం తెలుగులో 'డకాయిట్' చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఆయన తెరకెక్కించిన చిత్రం 'నిషాంచి’. క్రైమ్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమా, బాలీవుడ్‌కు దూరం కావడం గురించి ఆయనన మాట్లాడారు. 'ఇద్దరు కవల సోదరుల ఇతివృత్తంతో ఈ చిత్రం రూపొందింది. ఒకడు బాగా చదువుకుని జీవితంలో స్థిరపడతాడని, మరొకడు క్రైమ్‌లు చేస్తుంటాడు. ఈ రెండు పాత్రలను నూతన నటుడు ఐశ్వరీ ఠాక్రే పోషించారు. అయితే ఇందులో ఆయన డ్యూయల్ చేస్తున్నారనే సంగతి ఆయనకు తెలీదు. కొంత షూటింగ్ అయ్యాక ఆయనకు అసలు విషయం చెప్పి సర్‌ప్రైజ్ చేశా. ఓ పాత్ర చిత్రీకరణ పూర్తయిన తర్వాత.. బరువు తగ్గి మరో పాత్ర పోషించారాయన. చూడటానికి మాఽధురీ దీక్షిత్‌లా ఉండే వేదిక పింటో ఇందులో హీరోయిన్‌గా నటించారు’ అని అన్నారు.
ఇంకా చెబుతూ ‘స్ట్టార్స్‌తో సినిమాలు తీయడం నాకు నచ్చదు. స్టార్స్‌తో సినిమా అంటే భారీగా అంచనాలుంటాయి. వాటిని అందుకోలేకపోతే ఫైనల్‌గా నింద పడేది దర్శకుడిపైనే. అదే కొత్త నటీనటులతో సినిమా చేస్తే ఒత్తిడి ఉండదు. అందుకే ప్రయోగాలు చేయొచ్చు. నేను మొహమాటం లేకుండా మాట్లాడుతుంటానని చాలామంది అనుకుంటారు. అందులో నిజం లేదు. సైలెంట్‌గా నా పని నేను చేసుకుంటాను. నేనేం చేశానన్నది నా సినిమాలే చెబుతాయి. చానాళ్లుగా బాలీవుడ్ నన్ను ఓ ప్రమాదకర వ్యక్తిగా చూస్తోంది. బాలీవుడ్ వేదికగా నేను ఏం మాట్లాడినా దాని అర్థమే మారిపోతుంది. అలా మార్చేస్తున్నారు. దాంతో నాకు అవకాశాలు తగ్గాయి. నేను ఒంటరినన్న ఫీలింగ్ కలిగింది. ప్రస్తుతం బెంగళూరులో ప్రశాంతంగా ఉంటున్నా. వముంబైలో మూడేళ్లలో నేను రాయగలిగి దానికన్నా ఎక్కువ బెంగళూరులో ఎనిమిది నెలల్లోనే పూర్తిచేశా’ అని అన్నారు.
ALSO READ: Deepika Padukone: అల్లు అర్జున్ సినిమానే కారణమా...