Janhvi Kapoor: 'పరం సుందరి' ఆశలు 'పెద్ది'పైనే
ABN, Publish Date - Sep 01 , 2025 | 06:41 PM
అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉంది అన్నట్టుగా తయారైంది బీటౌన్ బ్యూటీ జాన్వీ కపూర్ పరిస్థితి. ఆకట్టుకునే అందం, మెప్పించే నటన అమ్మడి సొంతమైనా.. విజయాలు మాత్రం ఈ చిన్నదాని ఖాతాలో పడటంలేదు. తాజాగా మరో ఫ్లాప్ ను బూటీ అందుకోవడం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయిపోయింది.
బాలీవుడ్ సుందరి జాన్వీ కపూర్ (Janhvi Kapoor) కు మెగా హిట్ ను అందుకోవాలనే కోరిక తీరడం లేదు. ఎన్నో ఏళ్లుగా ట్రై చేస్తున్నా బాలీవుడ్ లో మాత్రం ఆ అదృష్టం దక్కడం లేదు. నటనకు స్కోప్ ఉన్న సినిమాల్ని ఎంచుకున్నా, అవి కమర్షియల్‌గా సక్సెస్ కాలేకపోతున్నాయి. జాన్వీ ఇంతవరకూ దాదాపు తొమ్మిది సినిమాలు చేస్తే.. ఎనిమిది పరాజయం పాలయ్యాయి. తొలి చిత్రం ధడక్ (Dhadak) తప్ప మరే సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకోలేకపోయింది. తాజాగా మరో ప్లాఫ్ ముద్దుగుమ్మ ఖాతాలో పడటంతో ఫ్యాన్స్ కూడా డిజప్పాయింట్ అవుతున్నారు.
జాన్వీ లేటెస్ట్‌గా తుషార్ జలోటా (Tushar Jalota) డైరెక్షన్‌లో సిద్ధార్థ్ మల్హోత్రా (Sidharth Malhotra) తో కలిసి 'పరం సుందరి' ( Param Sundari) అనే మూవీలో నటించింది. ఈ సినిమా కచ్చితంగా అమ్మడికి బ్రేక్ ఇస్తుందని అంతా భావించారు. కానీ ఊహించని విధంగా ఇది కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. కథలో ఎలాంటి ఫ్రెష్‌నెస్ లేకపోవడం, ఊహించిన ట్విస్టులు, బలహీనమైన కామెడీ సినిమాను మరింత డల్ చేశాయి. జాన్వీ మలయాళీ భామగా చాలా బాగా చేసినా, కథలో కొత్తదనం లేకపోవడంతో ఇది కూడా ముద్దుగుమ్మను ఆదుకోలేకపోయింది.
జాన్వీ కష్టాలు చూస్తున్న వారంతా ఇప్పుడు కొత్త సలహా ఇస్తున్నారు. బాలీవుడ్‌లో ఇప్పట్లో హిట్ కొట్టడం కష్టమేనని, దానికంటే రూట్ మార్చితే బెటర్ అని అంటున్నారు. బీ టౌన్‌లో స్ట్రగుల్ చేయడం కంటే, తెలుగు సినిమాల్లో ఫోకస్ చేయాలని చెబుతున్నారు. తెలుగులో ఇప్పటికే 'దేవర' (Devara)తో తన సత్తా చూపించింది. ప్రెజెంట్ గ్లోబర్ స్టార్ రామ్ చరణ్ తో 'పెద్ది' ( Peddi ) లో నటిస్తోంది. ఇప్పటికే బ్యూటీ లుక్ రివీల్ కాగా అంచనాలు పెరిగిపోయాయి. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ మూవీలో పవర్ ఫుల్ రోల్ లో జాన్వీ నటిస్తోంది. దీంతో టాలీవుడ్‌లో జూనియర్ అతిలోక సుందరికి మంచి ఫ్యూచర్ ఉండొచ్చని అంటున్నారు.
Read Also: Nag Ashwin: 'కల్కి 2'పై బాంబ్ పేల్చిన డైరెక్టర్
Read Also: Jayammu Nichayammu Raa: నా వోడ్కా ఎక్కడ.. జగపతిబాబును ఆడేసుకున్న ఆర్జీవీ