Alia Bhatt: ‘వార్-2’లో ఆలియా.. నిజమేనా..
ABN, Publish Date - Jul 26 , 2025 | 05:17 PM
బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్, ఇటు టాలీవుడ్ హీరో ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆతురతగా ఎదురుచూస్తున్న చిత్రం ‘వార్ 2’
బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్, ఇటు టాలీవుడ్ హీరో ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆతురతగా ఎదురుచూస్తున్న చిత్రం ‘వార్ 2’ (war 2). ఇందులో కియారా అడ్వాణీ (Kiara adwani) కథానాయిక. అయాన్ ముఖర్జీ దర్శకుడు. యశ్‌రాజ్ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రంలో మరో బ్యూటీ కూడా స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నట్లు సమాచారం. ఆలియా భట్ ఈ చిత్రంలో గెస్ట్ రోల్ చేస్తునట్లు చాలాకాలంగా వార్తలొస్తున్నాయి. దీనికి ఆమె తాజాగా పెట్టిన పోస్ట్ మరింత బలానిచ్చింది.
NBK: బాలయ్య మంచి మనసు.. అభిమాని కోసం ఏం చేశారంటే..
‘వార్ 2’, ‘ఆల్ఫా’ ఈ రెండు చిత్రాలను యశ్‌రాజ్ సంస్థ నిర్మిస్తోంది. ‘ఆల్పా?’లో అలియాకు గురువుగా హృతిక్ రోషన్ కనిపించనున్నట్లు గతంలో వార్తలొచ్చాయి. దీంతో ‘వార్ 2’లో హృతిక్, అలియాకు మధ్య చిన్న సన్నివేశం ఉండనున్నట్లు బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. సోసల్ మీడియాలో ఈ సినిమా ట్రైలర్‌ను షేర్ చేసిన అలియా ఆసక్తికరమైన క్యాప్షన్ ఇచ్చారు. ‘‘ఇది అద్భుతంగా ఉండనుంది. ఆగస్టు 14న థియేటర్‌లలో కలుద్దాం’ అని క్యాప్షన్ పెట్టారు. దీంతో ఆలియా కూడా ఈ సినిమాలో భాగంగా కానుందని అభిమానులు భావిస్తున్నారు.
ALSO READ:
Sobhan Babu: బ్లాంక్ చెక్ ఇచ్చినా మహేష్ కు తాతగా చేయను
Murali Mohan - Athadu: అతడు రీ రిలీజ్.. ఈసారి పక్కా హిట్..
Pawan Fans in London: మీ రూల్స్ ఎవరికి చెప్పారు.. ఎక్కడ పెట్టారు..
Shruti Haasan: ఆ ఫెయిల్యూర్స్ నా వల్ల జరగలేదు.. కానీ నింద నాపైనే..
Tanushree Dutta: సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్‌లా చంపే ప్లాన్‌లో..