NBK: బాలయ్య మంచి మనసు.. అభిమాని కోసం ఏం చేశారంటే..
ABN , Publish Date - Jul 25 , 2025 | 10:51 PM
నందమూరి బాలకృష్ణ మరోసారి తన మంచితనాన్ని చాటుకున్నారు. తన అభిమాని బద్రిస్వామి అనారోగ్య పరిస్థితి గురించి తెలిసి హిందూపూర్ ఎమ్మెల్యే స్పందించారు.
నందమూరి బాలకృష్ణ (NBK) మరోసారి తన మంచితనాన్ని చాటుకున్నారు. తన అభిమాని బద్రిస్వామి అనారోగ్య పరిస్థితి గురించి తెలిసి హిందూపూర్ ఎమ్మెల్యే స్పందించారు. కర్నూల్ జిల్లాలోని ఆదోనికి చెందిన బద్రిస్వామి కొన్ని నెలలుగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. చికిత్సకు రూ.20 లక్షలు అవుతుందని వైద్యులు తెలిపారు. ఆర్థిక సమస్యల కారణంగా చికిత్స చేయించుకోలేని అతడి పరిస్థితిని ఆదోని బాలకృష్ణ అభిమాన సంఘం అధ్యక్షుడు సజ్జాదాేస్సన్ బాలయ్య దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్పందించిన ఆయన రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.10 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించారు. సంబంధితపత్రాన్ని బాలకృష్ణ సతీమణి వసుంధర అందజేశారు. ప్రస్తుతం బాలకృష్ణ ఆఖండ–2 చిత్రంలో నటిస్తున్నారు. బోయపాటి శ్రీను ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. దసరాకు ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.