సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Alia Bhatt: ఆ వీడియోలను షేర్ చేయకండి.. మీకు అలా జరిగితే ఊరుకుంటారా

ABN, Publish Date - Aug 26 , 2025 | 08:13 PM

సెలబ్రిటీల గురించి తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరు చాలా ఆసక్తి చూపిస్తారు. వారు ఎలాంటి ఇళ్లలో ఉంటారు.. వారు ఏ కార్లు వాడతారు.. ఎలాంటి దుస్తులు వేసుకుంటారు..

Ranbir Kapoor - Alia Bhatt

Alia Bhatt: సెలబ్రిటీల గురించి తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరు చాలా ఆసక్తి చూపిస్తారు. వారు ఎలాంటి ఇళ్లలో ఉంటారు.. వారు ఏ కార్లు వాడతారు.. ఎలాంటి దుస్తులు వేసుకుంటారు.. వాళ్ల లగ్జరీ లైఫ్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే అది ఒక లిమిట్ వరకు ఉంటే ఓకే. కానీ, చాలామంది వారి పర్మిషన్ లేకుండా వారి ఫోటోలు తీయడం, ఇళ్లలో దూరడం చేసి వారి ప్రైవసీకి భంగం కలిగిస్తూ ఉంటారు. కొన్నిసార్లు ఓకే కానీ.. ప్రతిసారి అంటే వారు కూడా ఇబ్బంది పడతారు. అయినా కూడా కొందరు వదలకుండా వెంటపడి మరీ ఫోటోలు తీస్తూనే ఉంటారు.


ఇలాంటివాటిపై సెలబ్రిటీలు కొందరు తమ బాధను బయటకు చెప్తారు. కొందరు చెప్పరు. తాజాగా బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ అలాంటివారిపై ఫైర్ అయ్యింది. తమ ప్రైవసీకి భంగం కలిగిస్తున్నట్లు చెప్పుకొచ్చింది. అసలు ఏం జరిగింది అంటే.. అలియా - రణబీర్ ముంబైలో తమ కూతురు రాహా పేరు మీద ఒక లగ్జరీ ఇల్లును నిర్మించారు. దాని విలువ అక్షరాలా రూ. 250 కోట్లు అని వినికిడి. దగ్గరుండి తమకు నచ్చిన విధంగా ఆ ఇల్లును కట్టించుకుంటున్నారు. కొన్ని నెలల నుంచి మొదలుపెడితే ఈ మధ్యనే ఈ ఇల్లు రెడీ అయ్యింది.


ఇక రెడీ అయిన ఇంటిని కొందరు ఫోటోలు, వీడియోలు తీసి.. ఇదే అలియా - రణబీర్ కొత్త ఇల్లు.. లోపల ఎలా ఉందో.. ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయో చూడండి అంటూ కెమెరాలను జూమ్ చేసి మరీ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అవి కాస్తా వైరల్ అవ్వడంతో అలియా స్పందించింది. మీ ఇల్లు అయితే ఇలానే చేస్తారా అంటూ మండిపడింది. ఇది కంటెంట్ కాదు వైలేషన్ అంటూ విరుచుకు పడింది. తన ఇంటి వీడియోలను షేర్ చేయవద్దని, ఎవరి దగ్గరైనా ఉంటే డిలీట్ చేయమని కోరింది.


'ముంబై లాంటి సిటీలలో స్పేస్ కొంచెం తక్కువ అని నాకు తెలుసు. కొన్నిసార్లు మీరు కిటికీ లో నుంచి బయటకు చూసే వ్యూ వేరొకరి ఇల్లు. కానీ, అది వేరొకరి ప్రైవేట్ ఇళ్లను ఫోటోలు తీయడానికి, ఆ వీడియోలను ఆన్ లైన్ లో పోస్ట్ చేయడానికి కాదు. నిర్మాణంలో ఉన్న మా ఇంటి వీడియోను మాకు తెలియకుండా.. మా అనుమతి లేకుండా ప్రచురిస్తున్నారు. ఇది సెక్యూరిటీ సమస్య, ప్రైవసీకి సంబంధించిన విషయం. అనుమతి లేకుండా ఒకరి వ్యక్తిగత స్థలాన్ని చిత్రీకరించడం లేదా ఫోటో తీయడం కంటెంట్ అనిపించుకోదు.. వైలేషన్ అవుతుంది. దీన్ని సాధారణంగా తీసుకోకూడదు.


మీరే ఒకసారి ఆలోచించండి. మీ అనుమతి లేకుండా మీ ఇల్లును ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే మీరు ఊరుకుంటారా.. ఎవరూ అలా చేయరు. అందుకే నాది ఒక విన్నపం. ఇలాంటి కంటెంట్ కనుక మీరు ముందుకు తీసుకెళ్లాలి అనుకుంటే వెంటనే వాటిని ఆపేయండి. దయచేసి ఆ వీడియోలను షేర్ చేయకండి. మీడియాలో ఉన్న నా ఫ్రెండ్స్ కూడా ఇలాంటివి మీ వరకు వస్తే వాటిని వెంటనే తొలగించండి' అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం అలియా పోస్ట్ నెట్టింట వైరల్ గా మారాయి.

Sambarala Yeti Gattu: ఇది కూడా ఆగినట్టేనా తేజు

Baahubali The Epic Teaser: ‘బాహుబలి: ది ఎపిక్‌’ టీజర్ వచ్చేసింది

Updated Date - Aug 26 , 2025 | 08:13 PM