Baahubali The Epic Teaser: ‘బాహుబలి: ది ఎపిక్‌’ టీజర్ వచ్చేసింది

ABN, Publish Date - Aug 26 , 2025 | 05:05 PM

‘బాహుబలి: ది బిగినింగ్‌’ (Baahubali: The beginning) సినిమా విడుదలై పదేళ్లు పూర్తయింది. ఈ  సందర్భంగా సినిమాని మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు దర్శకుడు రాజమౌళి (SS Rajamouli) ఇటీవల అధికారికంగా ప్రకటించారు.  రెండు పార్టులుగా  వచ్చిన ఈ సినిమాల్ని ఇప్పుడు  ‘బాహుబలి: ది ఎపిక్‌’ (Baahubali: The Epic) పేరుతో ఒకటే సినిమాగా తీసుకురానున్నారు. అక్టోబరు 31న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.  ఈ సందర్భంగా మంగళవారం టీజర్‌ను (baahubali the epic teaser) విడుదల చేశారు. దీనికి  సంబంధించిన పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమా రీ రిలీజ్  నేపథ్యంలో టీమ్  అంతా ప్రమోషన్స్  నిర్వహించేందుకు సిద్ధమవుతోంది.  ప్రభాస్‌, అనుష్క, రానా సహా నటీనటులు, రాజమౌళి కూడా పాల్గొనున్నారని తెలిసింది. 

Updated at - Aug 26 , 2025 | 05:05 PM