సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Akshay Kumar: గుట్కా తినొద్దు

ABN, Publish Date - Sep 12 , 2025 | 07:36 PM

కామన్ గా హీరోలు ఎక్కడెక్కడ దొరుకుతారా.. ఎప్పుడెప్పుడు వారిని తమ ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేయాలా అని చూస్తుంటారు జర్నలిస్టులు.. కానీ ఆ బాలీవుడ్ హీరో మాత్రం జర్నలిస్టుకే షాక్ ఇచ్చి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాడు.

బాలీవుడ్ హీరోలకి గుట్కా, పాన్ మసాలాలతో ఉన్న సంబంధం గురించి అందరికీ తెలుసు. కొందరు స్టార్లు ఈ చెత్తను తినడమే కాదు.. జనం ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా ఈ బ్రాండ్లను ప్రచారం చేసి కోట్లు సంపాదిస్తారు. ఎంత ట్రోలింగ్ చేసినా.. కాసుల కోసం కక్కుర్తి పడి అసలు పట్టించుకోరు. కానీ తాజాగా హీరో అక్షయ్ కుమార్ (Akshay Kumar) మాత్రం ఈ విషయంలో భిన్నంగా ప్రవర్తించి టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాడు.


తాజాగా కాన్పూర్‌(Kanpur) లో అక్షయ్ కుమార్ అప్ కమింగ్ మూవీ 'జాలీ LLB 3' (Jolly LLB 3 ) ట్రైలర్ ఈవెంట్‌ జరిగింది.‌ ఇందులో పాల్గొన్న ఓ జర్నలిస్ట్, కాన్పూర్‌కి గుట్కా(Gutka) తో ఉన్న లింక్ గురించి అక్షయ్ ను అడిగాడు. అక్షయ్ స్ట్రెయిట్ గా గుట్కా తినొద్దు అని చెప్పేశాడు. ఆ జర్నలిస్ట్ మళ్లీ ఆ టాపిక్‌ని లాగడానికి ట్రై చేస్తే.. అక్షయ్ కూల్‌గా..‌ఇంటర్వ్యూ నాదా, నీదా.. గుట్కా తినొద్దని చెప్తున్నాగా అంటూ తర్వాతి నెక్స్ట్ ప్రశ్న ఏమిటో అడగమంటూ అని ఆ డిస్కషన్ కి ఫుల్ స్టాప్ పెట్టాడు.

గుట్కాకు వ్యతిరేకంగా అక్షయ్ కుమార్ చేసిన కామెంట్స్.‌. జర్నలిస్ట్‌కి ఇచ్చిన కౌంటర్... సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. గుట్కా గురించి సోషల్ మీడియాలో గట్టి చర్చ జరిగింది. ఇదే సమయంలో అక్షయ్ పాత పాన్ మసాలా యాడ్ గురించి కూడా అందరూ మాట్లాడుకున్నారు. దాంతో జర్నలిస్ట్ కు కౌంటర్ ఇచ్చిన అక్షయ్ సోషల్ మీడియా ట్రోల్స్ ను మాత్రం తప్పించుకోలేక పోయాడు.

Read Also: MEGA 158: వీరయ్యను మించే మాస్‌ ఎలిమెంట్స్‌తో..

Read Also: Kanchana 4: 'కాంచన 4' లో రశ్మిక, పూజ

Updated Date - Sep 12 , 2025 | 07:36 PM