సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Ajay Devgn: 'సు ఫ్రమ్ సో' డైరెక్టర్ తో అజయ్ దేవగన్

ABN, Publish Date - Aug 22 , 2025 | 02:02 PM

కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ అన్నాడో కవి. ఆ పాట సంగతేమో గాని బాలీవుడ్ ఇండస్ట్రీలో కొందరు హీరోలకు అదే జరుగుతోంది. ఒకప్పుడు అప్పర్ హ్యాండ్ గా ఉన్న హీరోలు ఇప్పుడు హిట్ కోసం అల్లాడుతున్నారు. అందుకోసం ఒకరి తర్వాత ఒకరు దక్షిణాది దర్శకులను నమ్ముకోవడం హాట్ టాపిక్ గా మారుతోంది.

ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన బాలీవుడ్ ప‌రిస్థితి ప్రెజెంట్ వ‌రెస్ట్‌గా మారింది. చేసిన సినిమాలు చేసిన‌ట్టుగా బాక్సాఫీస్ వ‌ద్ద బొక్కాబొర్లాప‌డుతున్నాయి. స్టార్ హీరోలు, క్రేజీ కాంబినేష‌న్లు కూడా వ‌ర్కౌట్ కావడం లేదు. వ‌రుస‌ డిజాస‌ర్లతో స‌త‌మ‌త‌మౌతోంది బాలీవుడ్. పైగా సౌత్ సినిమాల దండయాత్ర పెర‌గ‌డంతో డిఫెండ్ చేసుకోవ‌డానికి ట్రై చేస్తోంది. ఇందుకోసం సొంత ఇండస్ట్రీ మేకర్స్ తో కాకుండా పక్క ఇండస్ట్రీ దర్శకులతో సినిమాలు చేసేందుకు అక్కడి ఫ్లాప్ హీరోలు ఆసక్తి చూపుతున్నారు.


ఇప్పటికే బాలీవుడ్ స్టార్ హీరోస్ ఒక‌రి వెంట మ‌రొక‌రు సౌత్ డైరెక్టర్ల తో మూవీ చేసి సక్సెస్ ను అందుకున్నారు. 'యానిమల్' (Animal)తో సందీప్ వంగా (Sandeep Reddy), 'జవాన్' (Jawan) తో అట్లీ ( Atlee) బాలీవుడ్ లో భారీ హిట్లను కైవసం చేసుకున్నారు. అలానే 'జాట్'తో బాలీవుడ్ కి వెళ్ళిన గోపీచంద్ మలినేని (Gopichand Malineni) సైతం తనదైన మార్క్ చూపించాడు. రీసెంట్ గా అమీర్ ఖాన్ (Aamir Khan ) తో వంశీ పైడిపల్లి (Vamshi Paidipally) మూవీ ప్లాన్ చేస్తున్న తరుణంలో ఓ సౌత్ డైరెక్టర్ తో అజయ్ దేవగన్ (Ajay Devgn) మూవీ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

అజయ్ దేవగన్ రీసెంట్ గా 'సన్ ఆఫ్ సర్దార్ 2' (Son of Sardaar 2 ) తో ఆడియెన్స్ ముందుకు వచ్చాడు. కానీ ఆశించిన ఫలితాన్ని మాత్రం అందుకోలేపోయాడు. దీంతో సాలిడ్ సక్సెస్ కోసం కన్నడ చిత్రం 'సు ఫ్రమ్ సో' తో హిట్ అందుకున్న జె. పి. తుమినాడు (JP Tuminadu) తో మూవీ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కన్నడ హర్రర్ కామెడీ 'సు ఫ్రమ్ సో' (Su from So) బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని అందుకుంది. ఇది తెలుగులో కూడా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. దీంతో దర్శకుడు జేపీతో సినిమా చేయాలని అజయ్ ఇంట్రెస్ట్ చూపుతున్నట్లు ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది.

ఫిల్మ్ నగర్ సర్కిల్ లో చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం జేపీ తుమినాడు ఇప్పటికే అజయ్ దేవ్ గన్ కు స్టోరీ లైన్ వినిపించాడని తెలుస్తోంది. అజయ్ దేవ్ గన్ కూ కథ నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని... పూర్తి స్క్రిప్ట్ కోసం వేచి చూస్తున్నాడని టాక్. అన్ని అనుకున్నట్లుగా జరిగితే... త్వరలోనే ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరుపుకుంటుంది. ఈ చిత్రాన్ని కెవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తుందని, 2026లో ప్రథమార్థంలో రెగ్యులర్ షూటింగ్ ను మొదలు పెడతారని అంటున్నారు. కర్ణాటక కు చెందిన ఈ నిర్మాణ సంస్థ ఇప్పటికే హిందీలో అక్షయ్ కుమార్ తోనూ, సైఫ్ అలీఖాన్ తోనూ సినిమాలను నిర్మిస్తోంది. ఇప్పుడీ మూడో సినిమాతో బాలీవుడ్ లో కేవీఎన్ ప్రొడక్షన్స్ తన జోరు పెంచే ఆస్కారం ఉంది.

Read Also: Chiranjeevi: చరిత్రలో చిరస్థాయిగా.. మా గుండెల్లో చిరుస్థాయిగా .. 

Read Also: Super Good Films: విశాల్ సరసన మరోసారి అంజలి...

Updated Date - Aug 22 , 2025 | 02:08 PM