War-2: 'బంటీ ఔర్ బబ్లీ', 'ధూమ్ 3' తరహాలో...

ABN , Publish Date - Aug 06 , 2025 | 01:12 PM

ప్రముఖ దర్శక నిర్మాత ఆదిత్య చోప్రా 'వార్ -2' విషయంలో ఓ డిఫరెంట్ స్ట్రేటజీని ఫాలో అవుతున్నాడు. గతంలో తన సినిమాలకు అనుసరించినట్టుగా పాటలను నేరుగా వెండితెరపైనే చూపించాలని అనుకుంటున్నాడు.

War -2

ప్రముఖ దర్శక నిర్మాత ఆదిత్య చోప్రా (Aditya Chopra) 'వార్ 2' (War -2) సినిమా విషయంలో ఓ సక్సెస్ ఫుల్ ఓల్డ్ స్ట్రాటజీని ఫాలో అవుతున్నాడు. ఇప్పుడు చాలామంది ఫిల్మ్ మేకర్స్ సినిమాకు హైప్ తీసుకురావడం కోసం అందులోని పాటలను ఏదో ఒక మేరకు ముందే రిలీజ్ చేస్తున్నారు. ఆ పాటలే హీరోల అభిమానులను థియేటర్లకు తీసుకొస్తాయని, తద్వారా మంచి ఓపెనింగ్స్ పొందొచ్చనీ భావిస్తున్నారు. అయితే ఆదిత్య చోప్రా స్టైల్ వేరు. ఆయన పాటలకు సంబంధించిన గ్లింప్స్ ను మాత్రమే చూపించి, పాటలను థియేటర్లలోనే చూడమని చెప్పబోతున్నారు. గతంలో 'బంటీ ఔర్ బబ్లీ' (Bunty aur Babli) మూవీ విషయంలోనూ, 'ధూమ్ 3' (Dhoom 3) విషయంలోనూ ఇలానే జరిగింది.


అమితాబ్, అభిషేక్, ఐశ్వర్యపై చిత్రీకరించిన 'బంటీ ఔర్ బబ్లీ' మూవీలోని 'కజ్రా రే' సాంగ్ ఎంత హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. వెండితెరపై ఆ పాటను చూసి ఫిదా అయిన అభిమానులు మూవీకి సూపర్ హిట్ చేశారు. అలానే 'ధూమ్ -3' సాంగ్స్ కూడా డైరెక్ట్ గా థియేటర్లో చూడమని చెప్పేశాడు ఆదిత్య చోప్రా. ఇప్పుడు 'వార్ 2' విషయంలోనూ అదే జరుగబోతోంది. ఈ సినిమా ఆగస్ట్ 14న విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈ వారంలో గ్లింప్స్ ను రిలీజ్ చేయబోతున్నారు. ఇందులో ఇద్దరు మేటి డాన్సర్స్ చేసే డాన్సింగ్ మ్యాజిక్ కు వారి ఫ్యాన్స్ ఖుషీ అవుతారని తెలుసు. వారంతా రేపు వెండితెరపై ఈ పాట చూడాలని ఆదిత్య చోప్రా కోరుకుంటున్నాడు. అందుకే ఎట్టి పరిస్థితుల్లో పాటను ఉచితంగా చూపించకూడదని ఆయన భావిస్తున్నాడు. అలానే 'ధూమ్ 3’ పాటలన్నీ నేరుగా సిల్వర్ స్క్రీన్‌పైనే చూపించారు. ముఖ్యంగా కంమ్లీ పాటను థియేటర్‌లో చూసిన వారు వావ్ అనుకున్నారు. ఇప్పుడు ఎన్టీఆర్ - హృతిక్ డ్యాన్స్ సాంగ్‌ను కూడా యూట్యూబ్‌లో రిలీజ్ చేయకుండా నేరుగా థియేటర్లో చూసి ఆడియెన్స్ ఎక్స్‌పీరియెన్స్ చేయాలని ఆదిత్య చోప్రా కోరుకుంటున్నారు. ఆయన ప్రాధాన్యమంతా థియేటర్స్‌కు వచ్చే ఆడియెన్స్, టికెట్ సేల్స్ పైనే ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన యశ్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ నుంచి రానున్న ‘వార్ 2’లో కియారా అద్వానీ కథానాయికగా నటించింది. ఈ చిత్రం ఆగస్టు 14న హిందీ, తెలుగు, తమిళ భాషలలో విడుదల కానుంది.

Also Read: Manchu Manoj: డేవిడ్ రెడ్డి.. అంటున్న మంచు మ‌నోజ్‌! హిస్టారిక‌ల్ యాక్ష‌న్ మూవీ

Also Read: Ayyappa P. Sharma: కింగ్‌డ‌మ్‌లో.. చెప్పిన క‌థ అయిపోయింది! ఇంట‌ర్వ్యూలో సంచ‌ల‌న విష‌యాలు చెప్పిన అయ్యప్ప శర్మ

Updated Date - Aug 06 , 2025 | 01:18 PM

WAR 2: వార్‌-2.. తెలుగు కోసం కొత్త టైటిల్‌.. నిజమేనా?

War -2: ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు పూనకాలే!

War 2: ఇద్దరు స్టార్స్ ను డీల్ చేయడానికి అయాన్ తిప్పలు...

JR NTR: ఎన్టీఆర్ 'డ్రాగన్' తమిళ టైటిల్ పరిస్థితి ఏంటీ

Hrithik Roshan - Ntr: తారక్ తో డాన్స్.. హృతిక్ అంత మాట అన్నాడేంటి..