Ayyappa P. Sharma: కింగ్‌డమ్‌లో.. చెప్పిన కథ అయిపోయింది! ఇంటర్వ్యూలో సంచలన విషయాలు చెప్పిన అయ్యప్ప శర్మ
ABN , Publish Date - Aug 06 , 2025 | 10:41 AM
విలన్ పాత్ర అంటే భయంగా ఉండాలి.. ఆపై నటుడి వాచకం, చూపు అన్నీ కలిస్తేనే పరిపూర్ణ నటుడవుతాడు. అలాంటి నటుల్లో ఇప్పుడు అగ్ర స్థానంలో వినిపిస్తోన్న పేరు అయ్యప్ప పి. శర్మ.
విలన్ పాత్ర అంటే భయంగా ఉండాలి.. ఆపై నటుడి వాచకం, చూపు అన్నీ కలిస్తేనే పరిపూర్ణ నటుడవుతాడు. అలాంటి నటుల్లో ఇప్పుడు అగ్ర స్థానంలో వినిపిస్తోన్న పేరు అయ్యప్ప పి. శర్మ. (Ayyappa P. Sharma) తెలుగు వాడైనప్పటికీ కన్నడ సినిమాలతో పేరు సంపాదించుకుని ఇప్పుడు పాన్ ఇండియాలో బిజీ ఆర్టిస్ట్‌గా మారాడు. ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ ‘కేజీఎఫ్’ (KGF) సినిమాలో వానరం పాత్ర ఆయనకు చెరిగి పోలేని గుర్తింపును సంపాదించి పెట్టడంతో పాటు అశేష అభిమానులను, అవకాశాలను తీసుకు వచ్చింది, తీసుకు వస్తోంది. తాజాగా విజయ్ దేవరకొండ కింగ్డమ్ (Kingdom) సినిమాలో ఫుల్ లెంగ్త్ పాత్రలో నటించిన ఆయన ప్రేక్షకులను తన నటనతో మరోమారు మెప్పించారు. ప్రశంసలు దక్కించుకుంటున్నారు.
మీడియా ముందుకు ఆరుదుగా వచ్చే ఆయన తాజాగా ఏబీఎన్ ఆంధ్రజ్మోతి ఇంటర్వ్యూలో మరిన్ని ఇంట్రెస్టింగ్ డిటెయిల్స్ వెళ్లడించారు. సాయి కుమార్, రవి శంకర్‌ల తమ్ముడిగా కుటుంబ విషయాలతో పాటు తను నటించిన గత చిత్రాలతో పాటు నటించబోతున్న సినిమాలకు సంబంధించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. సాయి కుమార్ హీరోగా తను దర్శకత్వం వహించిన ఈశ్వర్ అల్లా (Eshwar Alla) చిత్రం ఫెయిల్యూర్, వచ్చిన నష్టం గురించితో పాటు కేజీఎఫ్ సినిమాలోకి వచ్చిన విధానం, ఆపై జరిగిన పరిణామాల గురించి వివరించారు. అదే విధంగా ఇటీవల వచ్చిన కింగ్‌డమ్ సినిమాకు సంబంధించి కీలక విషయాలు సైతం తెలిపారు. ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే పూర్తి ఇంటర్వ్యూ చూసేయండి.