War 2: ఇద్దరు స్టార్స్ ను డీల్ చేయడానికి అయాన్ తిప్పలు...

ABN , Publish Date - Jun 20 , 2025 | 04:08 PM

హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రలు పోషించిన 'వార్ -2' మూవీ ఆగస్ట్ 14న విడుదలవుతోంది. ఈ సందర్భంగా కథ తయారీలో తాను పడిన కష్టాన్ని తెలియచేశారు అయాన్ ముఖర్జీ.

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (NTR), బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ (Hrithik Roshan) ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం ‘వార్ 2’ (War -2). యశ్ రాజ్ ఫిలిమ్స్ (Yash Raj Films) స్పై యూనివర్స్‌ ఫ్రాంచైజీలో భాగంగా రూపొందుతున్న ఈ ఆరవ చిత్రాన్ని అయాన్ ముఖర్జీ (Ayan Mukarji) తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా గురించి ఆయన మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన అంశాలను తెలిపారు. ఇండియన్ సినిమాలో ఐకానిక్ స్టార్స్ హృతిక్, ఎన్టీఆర్ మధ్య సంఘర్షణ అందరినీ ఆకర్షించేలా రూపొందించటంలో తాను ఎక్కువగా సమయాన్ని వెచ్చించినట్లు ఆయన పేర్కొన్నారు.


ఆగ్టస్ 14న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది. ఆ సందర్భంగా అయాన్ ముఖర్జీ మాట్లాడుతూ, 'ప్రపంచ వ్యాప్తంగా ఎందరో ఇష్టపడిన 'వార్' సినిమాకు కొనసాగింపుగా ఫ్రాంచైజీని రూపొందించటం, దానిపై నాదైన ముద్ర వేయాలనుకుని కష్టపడటాన్ని ఓ పెద్ద బాధ్యతగా భావిస్తాను. 'వార్ 2' ను డైరెక్ట్ చేసేటప్పుడు నా తొలి చిత్రాన్ని డైరెక్ట్ చేసినట్లే భావించాను. బ్లాక్ బస్టర్ ఫ్రాంచైజీలో మన సినిమా అనేది భాగమయ్యేలా చూసుకోవాలి. లేకపోతే ఆనందం ఉండదు' అని అన్నారు.


'ఆల్ రెడీ బ్లాక్ బస్టర్ అయిన ఈ సినిమాను ముందుకు తీసుకెళుతున్నప్పుడు దానికంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. వారితో పాటు దేశంలోని ఇద్దరి సూపర్ స్టార్స్ ఫ్యాన్స్‌ను ఈ జర్నీలో భాగం చేయాలి. నిజాయతీగా చెప్పాలంటే ఓ దర్శకుడిగా ఇలాంటి భావనను కలిగించటానికి పూర్తిగా నిమగ్నమయ్యాను. ప్రేక్షకులకు ఓ సరికొత్త థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్ అందించేలా వార్-2 చిత్రాన్ని రూపొందించాం. ఎన్టీఆర్, హృతిక్ మధ్య ఉండే సంఘర్షణ అందరికీ కనెక్ట్ అయ్యేలా కథను, అందుకు తగినట్టు యాక్షన్ సన్నివేశాలను రూపొందించాం. ఇండియన్ సినిమాలోని ఇద్దరు బిగ్గెస్ట్ స్టార్స్ ఒకచోటికి చేరేలా వార్ 2 సినిమా చేసింది. వీరిద్దరి కలయికలో సినిమా ఎలా ఉంటుందోనని అభిమానులు, ప్రేక్షకులు ఎగ్జయిటెడ్‌గా ఉంటారో, వారి అంచనాలేంటో తెలుసు. అలాంటి వారు థియేటర్స్‌కు వచ్చినప్పుడు వారికి లైఫ్ టైమ్ ఎక్స్‌పీరియెన్స్‌లా ఈ సినిమా ఉండాలనే ఆలోచించి రూపొందించాం' అని అయాన్ చెప్పారు.

Also Read: Kubera Movie review: కుబేర సినిమా రివ్యూ

Also Read: 8 Vasantalu Movie Review : 8 వసంతాలు మూవీ రివ్యూ

Updated Date - Jun 20 , 2025 | 04:19 PM