Bollywood : దర్శకనిర్మాత రాజ్‌కుమార్‌ కోహ్లి ఇకలేరు!

ABN , First Publish Date - 2023-11-24T16:05:56+05:30 IST

బాలీవుడ్‌లో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ దర్శకనిర్మాత రాజ్‌కుమార్‌ కోహ్లి(93) (Rajkumar kohli ) ఇక లేరు. ముంబైలోని తన నివాసంలో శుక్రవారం ఉదయం గుండెపోటుతో ఆయన కన్నుమూశారు

Bollywood : దర్శకనిర్మాత  రాజ్‌కుమార్‌ కోహ్లి ఇకలేరు!

బాలీవుడ్‌లో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ దర్శకనిర్మాత రాజ్‌కుమార్‌ కోహ్లి(93) (Rajkumar kohli ) ఇక లేరు. ముంబైలోని తన నివాసంలో శుక్రవారం ఉదయం గుండెపోటుతో ఆయన కన్నుమూశారు. ఉదయం 8 గంటలకు స్నానం చేయడానికి బాత్రూమ్‌లోకి వెళ్లిన ఆయన ఎంతకూ బయటకు రాలేదు. దీంతో ఆయన కుమారుడు అర్మాన్‌ కోహ్లి తలుపులు బద్దలు కొట్టి లోనికి వెళ్లగా ఆయన నిర్జీవంగా కిందపడి ఉన్నారు. రాజ్‌కుమార్‌ కోహి మరణంపై చిత్రపరిశ్రమ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేసింది. శుక్రవారం సాయంత్రం రాజ్‌కుమార్‌ కోహ్లి అంత్యక్రియలు జరగనున్నాయి. (RIP Rajkumar kohli)

జానీ దుష్మణ్‌, రాజ్‌ తిలక్‌, విరోధి, నాగిన్‌, పతీ పత్నీ ఔర్‌ తవైఫ్‌ వంటి పదిహేడు చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. అరడజనకు పైగా చిత్రాలు నిర్మించారు. ఆయన దర్శకత్వం వహించిన చివరి చిత్రం ుజానీ దుష్మణ్‌ 2002లో విడుదలైంది. బాలీవుడ్‌ స్టార్స్‌ సన్నీ యోల్‌, సునీల్‌ దత్‌, మిథున్‌ చక్రవర్తి, అనిల్‌ కపూర్‌ వంటి పలువురు హీరోలతో ఆయన పని చేశారు.

Updated Date - 2023-11-24T16:17:12+05:30 IST