Hindi Bigg Boss: హిందీ బిగ్ బాస్ లో తెలుగు స్టార్లు
ABN , Publish Date - Jul 11 , 2025 | 06:48 PM
బుల్లితెర బిగ్ షో బిగ్ బాస్ రెడీ అవుతోంది. బీటౌన్ ఆడియెన్స్ ను టీవీలకు కట్టిపడేసే స్ట్రాటజీలతో రెడీ అవుతోంది. బాలీవుడ్డే కాదు.. ఈసారి టాలీవుడ్ ఆడియెన్స్ కూడా కనెక్ట్ అయ్యే ప్లాన్ వేస్తోంది.
బిగ్ బాస్ ( Bigg Boss ).. ఇండియాలో అత్యంత హిట్ రియాలిటీ షోల్లో ఒకటి. హిందీ, తెలుగు, కన్నడ, తమిళం లో ఎన్ని కాంట్రవర్శీలు వస్తున్న క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. టన్నుల కొద్ది ఎంటర్ టైన్ మెంట్ ఇవ్వడంతో పాటు టీఆర్పీ రేటింగ్స్ సరికొత్త రికార్డ్ ను క్రియేట్ చేస్తోంది. తాజాగా ఈ ప్రోగ్రామ్ మరో సీజన్ తో గ్రాండ్ రీఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతోంది. సెప్టెంబర్ నుంచి హిందీలో 19వ సీజన్‌తో ఈ షో బుల్లితెరపై సందడి చేయనుంది. బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ (Salman Khan) మరోసారి హోస్ట్‌గా అదరగొట్టడానికి సిద్ధమవుతుండగా..ఈ సీజన్‌లో పాల్గొనే కంటెస్టెంట్స్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ అప్‌డేట్స్ బయటకు వచ్చాయి.
ప్పటికే కంటెస్టెంట్స్ ఎంపిక జోరుగా సాగుతుందని... అయితే హౌస్ లోకి ఎవరెవరు ఎంట్రీ ఇవ్వబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. తాజాగా హిందీ బిగ్ బాస్ లో తెలుగులో పాపులారిటీని సంపాదించుకున్న వారిని దింపాలని భావిస్తున్నారట నిర్వహాకులు. అందులో భాగంగా టీటౌన్ లో మంచి పేరు తెచ్చుకున్న స్టార్లను దింపబోతున్నట్లు టాక్. సోషల్ మీడియాలో వినిపిస్తున్న టాక్ ప్రకారం ఆశిష్ విద్యార్థి (Ashish Vidhyarthi), నటి అనిత (Anita) ఈ షోలో జోయిన్ అవుతున్నారట. ఆశిష్ విద్యార్థి 'పోకిరి'(Pokkiri )తో పాటు అనేక సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. మరోవైపు నటి అనిత ఉదయ్ కిరణ్ సినిమా 'నువ్వు నేను' ('Nuvvu Nenu)లో తన నటనతో ఆకట్టుకుంది. హిందీ, తెలుగు ప్రేక్షకుల్లో ఈ ఇద్దరికీ మంచి ఫ్యాన్ బేస్ ఉంది. దీంతో హిందీతో పాటు సౌత్ లోనూ ఈ షో హిట్ కొడుతుందని దాని ప్రమోటర్స్ అంచనా వేస్తున్నారు.
మరోవైపు ఈ సీజన్‌లో పాల్గొనడానికి ఆశిష్ విద్యార్థి , అనిత భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఇక ఈ షోలో మరో అట్రాక్షన్ కూడా ఉంది. సల్మాన్ ఖాన్‌తో పాటు ప్రముఖ డైరెక్టర్ ఫరా ఖాన్ (Farah Khan) కూడా ఈ షోను కో-హోస్ట్ చేయనుంది. మొత్తానికి గతానికి మించిన హైప్ తో , ఇంట్రెస్టింగ్ థింగ్స్ తో కొత్త సీజన్ ముస్తాబవుతోంది. చూడాలి మరి ఈసారి హిందీ బిగ్ బాస్ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో.