మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Trisha: చిరు ఇచ్చిన గిఫ్ట్‌తో మురిసిపోతోన్న త్రిష.. ఇంతకీ చిరు ఏమిచ్చారంటే..

ABN, Publish Date - Mar 10 , 2024 | 10:20 PM

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘బింబిసార’ దర్శకుడు వశిష్ట దర్శకత్వంలో చేస్తున్న మెగా ఫాంటసీ అడ్వెంచర్‌ ‘విశ్వంభర’. ఈ సినిమాలో త్రిష హీరోయిన్‌గా నటిస్తోన్న విషయం తెలిసిందే. రీసెంట్‌గానే త్రిషకి సంబంధించి అధికారిక ప్రకటనతో పాటు.. ఆమె షూట్‌లో జాయిన్ అయినట్లుగా మేకర్స్ ప్రకటించారు. త్రిష సెట్‌లోకి ఎంటరైన ఫొటోలను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ‘విశ్వంభర’ షూట్‌లో బిజీగా ఉన్న త్రిష.. తాజాగా సోషల్ మీడియా వేదికగా తనకందిన గిఫ్ట్‌తో మురిసిపోతున్నట్లుగా ప్రకటించారు.

Chiranjeevi and Trisha

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ప్రస్తుతం ‘బింబిసార’ దర్శకుడు వశిష్ట దర్శకత్వంలో చేస్తున్న మెగా ఫాంటసీ అడ్వెంచర్‌ ‘విశ్వంభర’ (Vishwambhara). ఈ సినిమాలో త్రిష హీరోయిన్‌గా నటిస్తోన్న విషయం తెలిసిందే. రీసెంట్‌గానే త్రిషకి సంబంధించి అధికారిక ప్రకటనతో పాటు.. ఆమె షూట్‌లో జాయిన్ అయినట్లుగా మేకర్స్ ప్రకటించారు. త్రిష (Trisha) సెట్‌లోకి ఎంటరైన ఫొటోలను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ‘విశ్వంభర’ షూట్‌లో బిజీగా ఉన్న త్రిష.. తాజాగా సోషల్ మీడియా వేదికగా తనకందిన గిఫ్ట్‌తో మురిసిపోతున్నట్లుగా ప్రకటించారు.

వివరాల్లోకి వెళితే.. త్రిషకు మెగాస్టార్ చిరంజీవి టెంపరేచర్ కంట్రోల్ మగ్‌ (Temperature Control Mug)ను గిఫ్ట్‌గా పంపించారు. ఆ గిఫ్ట్ తనకు ఎంతో నచ్చిందని త్రిష తన పోస్ట్‌లో తెలిపారు. ‘‘చాలా బాగుంది.. నా సొంత టెంపరేచర్ కంట్రోల్ మగ్.. చిరు సార్.. ఇది నాకెంతో నచ్చింది. థ్యాంక్యూ సార్’’ అని చిరు పంపిన టెంపరేచర్ కంట్రోల్ మగ్‌ని త్రిష్ పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ చూసిన వారంతా.. చిరుపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. (#MegastarChiranjeevi)


ఇక చిరు ఇచ్చిన గిఫ్ట్ విషయానికి వస్తే.. ఆటోమేటిక్ టెంపరేచర్ కంట్రోల్ బాటిల్‌లా ఉంది. దీనిలో కాఫీ, టీ, వాటర్ వంటి వాటిని కావాల్సిన టెంపరేచర్‌లో స్టోర్ చేసుకోవచ్చు. వింటర్, సమ్మర్ అనే తేడా లేకుండా.. ఇది ఎప్పటికీ ఉపయోగపడే పరికరం. అందుకే తనకు గిఫ్ట్‌ (Chiru Gift)గా వచ్చిన దీనిని అంత ఇష్టపడుతున్నట్లుగా త్రిష తెలియజేశారు. ప్రస్తుతం త్రిష చేసిన పోస్ట్‌తో ఈ బాటిల్ గురించి అంతా తెగ సెర్చ్ చేస్తుండటం విశేషం. అలాగే త్రిష చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. (#Trisha)


ఇవి కూడా చదవండి:

====================

*Akash Puri: నాకు నేనుగా హీరోగా పేరు తెచ్చుకున్న తర్వాతే నాన్నతో..!

**********************

*Swag: శ్రీవిష్ణు సరసన నటించే క్వీన్ రుక్మిణి దేవి ఎవరంటే..

****************************

*Patang: పాత‌బ‌స్తీలో ‘పతంగ్’ పాట వదిలారు..

**********************

*Shambho Mahadeva: మణిశర్మ మెప్పు పొందిన వర్ధమాన గాయని.. ఎవరంటే?

************************

Updated Date - Mar 10 , 2024 | 10:20 PM