Rashmika Mandanna: టోక్యో ఎయిర్ పోర్ట్‌లో రష్మికకు సర్‌ప్రైజింగ్ వెల్కమ్

ABN , Publish Date - Mar 01 , 2024 | 01:51 PM

‘క్రంచీరోల్ అనిమీ అవార్డ్స్‌’లో భారత్ తరపున పాల్గొనేందుకు జపాన్‌లోని టోక్యో‌కి వెళ్లింది స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా. శనివారం టోక్యోలో ఈ అవార్డ్స్ వేడుక జరగనుంది. గ్లోబల్ ఈవెంట్‌గా జరుగుతున్న ఈ అవార్డ్స్ కార్యక్రమంలో భారతదేశం తరపున రష్మిక రిప్రెజెంట్ చేస్తోంది. ఈ గౌరవం దక్కిన ఏకైక నటిగా రష్మికా మందన్నా రికార్డ్ క్రియేట్ చేసింది. అయితే టోక్యో ఎయిర్ పోర్ట్‌లో ఆమెకు జపాన్ ఫ్యాన్స్ సర్‌ప్రైజింగ్ వెల్కమ్ చెప్పారు.

Rashmika Mandanna: టోక్యో ఎయిర్ పోర్ట్‌లో రష్మికకు సర్‌ప్రైజింగ్ వెల్కమ్
Rashmika with Japan Fan

‘క్రంచీరోల్ అనిమీ అవార్డ్స్‌’ (Crunchyroll Anime Awards)లో భారత్ (India) తరపున పాల్గొనేందుకు జపాన్‌ (Japan)లోని టోక్యో‌(Tokyo)కి వెళ్లింది స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా. శనివారం టోక్యోలో ఈ అవార్డ్స్ వేడుక జరగనుంది. గ్లోబల్ ఈవెంట్‌గా జరుగుతున్న ఈ అవార్డ్స్ కార్యక్రమంలో భారతదేశం తరపున రష్మిక రిప్రెజెంట్ చేస్తోంది. ఈ గౌరవం దక్కిన ఏకైక నటిగా రష్మికా మందన్నా రికార్డ్ క్రియేట్ చేసింది. అయితే టోక్యో ఎయిర్ పోర్ట్‌లో ఆమెకు జపాన్ ఫ్యాన్స్ సర్‌ప్రైజింగ్ వెల్కమ్ చెప్పారు. రష్మిక ఫొటోస్‌తో డిజైన్ చేసిన ఫ్లకార్డులు చూపిస్తూ ఆమెను ఆహ్వానించారు. Rashmika at Tokyo Airport)


Crushmika.jpg

ఎయిర్ పోర్ట్‌లో అభిమానులు (Rashmika Fans) ఇచ్చిన వెల్కమ్‌తో రష్మిక ఆశ్చర్యపోయింది. సర్‌ప్రైజ్ అవుతూ వారికి హాయ్ చెప్పింది. ‘పుష్ప, డియర్ కామ్రేడ్’ వంటి సినిమాలతో నేషనల్ క్రష్‌గా మాత్రమే కాదు.. గ్లోబల్‌గా రష్మిక అభిమానులను సంపాదించుకుంది. జపాన్‌లోనూ ఆమెకు ఫ్యాన్స్ ఉన్నారు. వారు తనపై చూపిస్తున్న ప్రేమకు పొంగిపోతూ.. రష్మిక తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. ప్రస్తుతం రష్మిక మందన్నా ‘పుష్ప 2’ (Pushpa 2), ‘ది గర్ల్ ఫ్రెండ్’ (The Girlfriend) సినిమాలతో పాటు ఓ హిందీ ప్రాజెక్ట్‌లోనూ నటిస్తోంది.


ఇవి కూడా చదవండి:

====================

*Prashanth: రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదు

****************************

*SV18: గీతా ఆర్ట్స్‌లో సినిమా.. శ్రీ విష్ణు రియాక్షన్ చూశారా..

***********************************

*Mega Brother: ఆ వ్యాఖ్యలపై సారీ చెప్పిన మెగా బ్రదర్..

*************************

*Sree Vishnu: ‘రాజ రాజ చోర’ కాంబినేషన్ రిపీట్.. ఈసారి అచ్చతెలుగు సినిమా!

**************************

Updated Date - Mar 01 , 2024 | 01:51 PM