40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Mahesh Babu: ‘గుంటూరు కారం’ టీమ్‌కి మహేష్ గ్రాండ్ పార్టీ.. ఫొటోలు వైరల్

ABN, Publish Date - Jan 16 , 2024 | 10:19 AM

సూపర్ స్టార్ మహేష్ బాబు తన లేటెస్ట్ సెన్సేషన్ ‘గుంటూరు కారం’ సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. ఆ ఎంజాయ్‌ని ఆయనొక్కడే కాకుండా.. టీమ్‌తో కలిసి షేర్ చేసుకోవడం చూస్తుంటే.. ‘గుంటూరు కారం’ సినిమా ఆయన మనసుకు ఎంత దగ్గరైందో అర్థం చేసుకోవచ్చు. సంక్రాంతి రోజు, సోమవారం రాత్రి మహేష్ బాబు తన టీమ్‌తో కలిసి ‘గుంటూరు కారం’ సక్సెస్‌ను ఎంజాయ్ చేశారు.

Guntur Kaaram Team at Mahesh Babu House

సూపర్ స్టార్ మహేష్ బాబు (Super Star Mahesh Babu) తన లేటెస్ట్ సెన్సేషన్ ‘గుంటూరు కారం’ (Guntur Kaaram) సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. ఆ ఎంజాయ్‌ని ఆయనొక్కడే కాకుండా.. టీమ్‌తో కలిసి షేర్ చేసుకోవడం చూస్తుంటే.. ‘గుంటూరు కారం’ సినిమా ఆయన మనసుకు ఎంత దగ్గరైందో అర్థం చేసుకోవచ్చు. సంక్రాంతి (Sankranthi) రోజు, సోమవారం రాత్రి మహేష్ బాబు తన టీమ్‌తో కలిసి ‘గుంటూరు కారం’ సక్సెస్‌ను ఎంజాయ్ చేశారు. ‘గుంటూరు కారం’ టీమ్‌కు ఆయన గ్రాండ్ పార్టీ ఇచ్చారు. ఈ పార్టీ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘గుంటూరు కారం’ టీమ్‌తో పాటు తనకు అత్యంత సన్నిహితులైన వారిని మాత్రమే మహేష్ ఈ పార్టీకి ఆహ్వానించారు. (Mahesh Babu Grand Party to Guntur Kaaram Team)

తన ఇంట్లో స్వయంగా మహేష్ ఇచ్చిన ఈ గ్రాండ్ పార్టీకి హీరోయిన్స్ శ్రీలీల, మీనాక్షి చౌదరి.. నిర్మాతలు దిల్ రాజు, దిల్ రాజు వైఫ్, శిరీష్, నాగవంశీ.. ఇంకా ఇతర టీమ్ హాజరయ్యారు. అలాగే తనకు అత్యంత సన్నిహితులైన వంశీ పైడిపల్లి, మెహర్ రమేష్ వంటి వారు ఫ్యామిలీతో ఈ పార్టీలో పాల్గొన్నారు. ఈ టీమ్‌తో మహేష్ గారాల పట్టి సితార కూడా చక్కగా ఎంజాయ్ చేసింది. ఆ ఫొటోలు కూడా సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. ఈ పార్టీకి హాజరైన అతిథులకు మహేష్ వైఫ్ నమ్రత దగ్గరుండి మరీ.. అన్ని ఎరేంజ్‌మెంట్స్ చూసుకున్నట్లుగా తెలుస్తోంది. అలాగే ఇప్పటి వరకు వచ్చిన ఫొటోలలో దర్శకుడు త్రివిక్రమ్ మాత్రం ఎక్కడా కనిపించలేదు. (Guntur Karam Success Celebrations at Mahesh Babu House)


ఇదిలా ఉంటే.. సంక్రాంతి స్పెషల్‌గా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా.. బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇందులో సూపర్ స్టార్ మహేష్ బాబు నటనకు ప్రేక్షకులు, అభిమానులు ఫిదా అవుతున్నారు. సోమవారం కూడా ఈ సినిమా భారీగానే కలెక్షన్లు రాబట్టినట్లుగా తెలుస్తోంది. విడుదలైన మూడు రోజులకు ఈ సినిమా రూ. 164 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ని రాబట్టి.. ఇంకా హౌస్ ఫుల్ కలెక్షన్లతో విజయవిహారం చేస్తోంది. మహేష్ బాబు కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకెళుతోంది. (Guntur Kaaram Collections)


ఇవి కూడా చదవండి:

====================

*Anasuya: సంక్రాంతి సెలబ్రేషన్స్‌లో.. అనసూయ చర్యలు ఊహాతీతం

**************************

*K Raghavendra Rao: ‘హనుమాన్’, ‘నా సామిరంగ’ సక్సెస్‌లపై దర్శకేంద్రుడి స్పందన ఇదే..

****************************

*Netflix: ‘దేవర’, ‘పుష్ప2’.. 2024లో నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చే 12 సినిమాల లిస్ట్ విడుదల

****************************

*Mega156: మెగాస్టార్ చిరంజీవి, వశిష్ట కాంబో చిత్ర టైటిల్ ఇదే.. టైటిల్ గ్లింప్స్ అద్భుతం

************************

Updated Date - Jan 16 , 2024 | 10:29 AM