scorecardresearch

Mega156: మెగాస్టార్ చిరంజీవి, వశిష్ట కాంబో చిత్ర టైటిల్ ఇదే.. టైటిల్ గ్లింప్స్ అద్భుతం

ABN , Publish Date - Jan 15 , 2024 | 05:24 PM

మెగాస్టార్ చిరంజీవి మెగా ఫాంటసీ అడ్వెంచర్ చిత్రానికి టైటిల్ ఫిక్సయింది. సంక్రాంతిని పురస్కరించుకుని ఈ చిత్ర టైటిల్ లుక్ పోస్టర్‌ని మేకర్స్ విడుదల చేశారు. ‘బింబిసార’ ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో.. యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న మెగా మాస్ బియాండ్ యూనివర్స్ చిత్రానికి ‘విశ్వంభర’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. సంక్రాంతి స్పెషల్‌గా విడుదల చేసిన ఈ చిత్ర టైటిల్ గ్లింప్స్ అద్భుతం అనేలా ఉంది.

Mega156: మెగాస్టార్ చిరంజీవి, వశిష్ట కాంబో చిత్ర టైటిల్ ఇదే.. టైటిల్ గ్లింప్స్ అద్భుతం
Vishwambhara Title Look

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) మెగా ఫాంటసీ అడ్వెంచర్ చిత్రానికి టైటిల్ ఫిక్సయింది. సంక్రాంతిని పురస్కరించుకుని ఈ చిత్ర టైటిల్ లుక్ పోస్టర్‌ని మేకర్స్ విడుదల చేశారు. ‘బింబిసార’ ఫేమ్ వశిష్ట (Vassishta) దర్శకత్వంలో.. యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న మెగా మాస్ బియాండ్ యూనివర్స్ చిత్రానికి ‘విశ్వంభర’ (Vishwambhara) అనే టైటిల్‌ని ఖరారు చేశారు. వాస్తవానికి ఈ టైటిల్ ఖరారు అయినట్లుగా ఎప్పటి నుండో వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అదే టైటిల్‌ని ఖరారు చేస్తూ మేకర్స్ విడుదల చేసిన పోస్టర్ ఆసక్తికరంగా ఉండటమే కాకుండా.. సినిమాపై అంచనాలను పెంచేస్తోంది. (#Mega156 Vishwambhara)

అనౌన్స్‌మెంట్ పోస్టర్‌తోనే సర్వత్రా ఆసక్తిని క్రియేట్ చేసిన ఈ సినిమా.. టైటిల్ లుక్‌తో మరింత క్యూరియాసిటీని పెంచేస్తోంది. ఈ టైటిల్ రివీల్ చేసిన తీరు అయితే అద్భుతం అనేలా ఉంది. హనుమాన్ విగ్రహం, బాక్స్, ఉల్కలు ఇవన్నీ మిక్స్ చేసి టైటిల్‌ని రివీల్ చేసిన తీరు.. ముఖ్యంగా విఎఫ్ఎక్స్ వర్క్ వావ్ అనేలా ఉంది. మొత్తంగా అయితే టైటిల్ లుక్‌తోనే దైవత్వాన్ని పరిచయం చేశారు. అలాగే ఈ సినిమాని రాబోయే సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లుగా కూడా ఇందులో రివీల్ చేశారు. (Chiranjeevi New Film Vishwambhara)


Mega-Mass.jpg

దసరాకి ఈ సినిమాని గ్రాండ్‌గా ప్రారంభించిన మేకర్స్.. పాటల రికార్డింగ్‌తో సినిమాని మొదలెట్టారు. ఆ వెంటనే రెగ్యులర్ షూట్‌ని కూడా ప్రారంభించారు. ప్రస్తుతం శరవేగంగా ఈ చిత్రం చిత్రీకరణ జరుపుకుంటోంది. విక్రమ్, వంశీ, ప్రమోద్‌ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమా ఇప్పటి వరకు మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో కాస్ట్లీయస్ట్ చిత్రంగా నిర్మాణం జరుపుకుంటోంది. అత్యున్నత సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పని చేస్తున్నారు. ఎం.ఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా, ఛోటా కె నాయుడు సినిమాటోగ్రాఫర్. ఏఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ కాగా, సుస్మిత కొణిదెల కాస్ట్యూమ్ డిజైనర్. సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్ అందించగా, కోటగిరి వెంకటేశ్వరరావు, సంతోష్ కామిరెడ్డి ఎడిటర్లుగా వ్యవహరిస్తున్నారు. శ్రీ శివశక్తి దత్తా, చంద్రబోస్ లిరిక్ రైటర్స్ కాగా, శ్రీనివాస్ గవిరెడ్డి, గంటా శ్రీధర్, నిమ్మగడ్డ శ్రీకాంత్, మయూఖ్ ఆదిత్య స్క్రిప్ట్ అసోసియేట్‌లుగా పని చేస్తున్నారు. (Vishwambhara Title Glimpse)


ఇవి కూడా చదవండి:

====================

*Vijay Binni: ‘నా సామిరంగ’ రిజల్ట్‌పై దర్శకుడి రియాక్షన్ ఇదే..

***************************

*Teja Sajja: ‘హను-మాన్’ విడుదల తర్వాత మెగాస్టార్ ఏమని మెసేజ్ చేశారంటే..

***************************

*Extra Ordinary Man: ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ ఓటీటీలోకి వచ్చే డేట్ ఫిక్స్

**************************

*Guntur Kaaram: రెండో రోజూ రమణగాడు రాంప్ ఆడేశాడు.. రెండు రోజుల కలెక్షన్స్ ఎంతంటే?

****************************

Updated Date - Jan 15 , 2024 | 05:32 PM

News Hub